Neckband Earphones Under Rs 1000: రూ.1000 లోపే అదిరిపోయే బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ - అదిరిపోయ్ సౌండ్ ఖాయం!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఆడియో బ్రాండ్ పోర్‌ట్రోనిక్స్ మనదేశంలో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. వీటి ధర రూ.999 నుంచి ప్రారంభం కానుంది.
Portronics Harmonics 250 India Launch: పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ 250 (Portronics Harmonics 250), పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ ఎక్స్1 (Portronics Harmonics X1) నెక్‌బ్యాండ్ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. వీటిలో రెండు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 10.5 ఎంఎం డ్రైవర్లను పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ 250లో అందించారు. ఇక పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ ఎక్స్1లో 10 ఎంఎం డ్రైవర్లు అందుబాటులో ఉన్నాయి.
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ 250 ధర (Portronics Harmonics 250 Price in India)
వీటి ధరను మనదేశంలో రూ.1,199గా నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు.
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ ఎక్స్1 ధర (Portronics Harmonics X1 Price in India)
వీటి ధర రూ.999గా ఉంది. బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు ఇయర్ ఫోన్స్ కొనుగోలుపై ఒక సంవత్సరం వారంటీ అందించనున్నారు.
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ 250 స్పెసిఫికేషన్లు (Specifications)
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ 250 నెక్‌బ్యాండ్‌లో 10.5 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించారు.సిలికోన్‌తో వీటిని రూపొందించారు. వీటి బరువు చాలా తక్కువగా ఉండనుంది. ఎర్గోనోమిక్ డిజైన్‌తో వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో మ్యాగ్నెట్‌ను కూడా కంపెనీ అందించింది.
బ్లూటూత్ వీ5 కనెక్టివిటీ ఫీచర్‌ను ఇందులో అందించారు. 10 మీటర్ల రేంజ్‌ను ఇవి అందించనున్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో టచ్ కంట్రోల్స్ కూడా అందించారు. వీటి ద్వారా కాల్స్‌ను ఆన్సర్, రిజెక్ట్ చేయవచ్చు. అలాగే సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇతర స్మార్ట్ డివైస్‌లకు కూడా దీన్ని పెయిర్ చేయవచ్చు. అమెజాన్, అలెక్సా గూగుల్ అసిస్టెంట్‌లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 800 ఎంఏహెచ్‌గా ఉంది. 60 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. 1000 గంటల స్టాండ్‌బై టైంను ఇది అందించనుంది. దీని మందం 0.35 సెంటీమీటర్లు కాగా... బాక్స్‌తో కలిపి మొత్తం బరువు కేవలం 58 గ్రాములు మాత్రమే.
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ ఎక్స్1 స్పెసిఫికేషన్లు (Specifications)
పోర్‌ట్రోనిక్స్ హార్మోనిక్స్ ఎక్స్1లో 10 ఎంఎం డ్రైవర్లను ఇందులో అందించారు. సిలికోన్ కేసింగ్ ఇందులో ఉండనుంది. ఎక్కువ సేపు ఉపయోగించడానికి కూడా కంఫర్ట్‌గా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. దీంతోపాటు వీటి బరువు కూడా తక్కువగానే ఉండనుంది.
ఇందులో కూడా బ్లూటూత్ వీ5 కనెక్టివిటీనే అందించారు. 10 మీటర్ల దూరంలో ఉండి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. 150 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వీటి ప్లేబ్యాక్ టైం 15 గంటలు కాగా... 55 గంటల స్టాండ్‌బై టైంను ఇవి అందించనున్నాయి. దీని బరువు 0.3 ఎంఎం కాగా... బరువు 60 గ్రాములుగా ఉంది. ఈ రెండిట్లోనూ డ్రైవర్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి... మంచి ఆడియో క్వాలిటీని ఇవి అందించనున్నాయి.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!