Poco X6: పోకో ఎక్స్6లో కొత్త వేరియంట్ తెచ్చిన కంపెనీ - 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో!
Poco X6 New Variant: పోకో ఎక్స్6లో కొత్త వేరియంట్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది.
Poco New Phone: పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్లు జనవరిలో మనదేశంలో మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు పోకో ఎక్స్6లో కొత్త వేరియంట్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. పోకో ఎక్స్6లొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. పోకో ఎక్స్6 బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్‌గా ఉంది.
పోకో ఎక్స్6 ధర (Poco X6 Price in India)
ఇందులో గతంలో వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999గానూ ఉంది. ఇప్పుడు తాజాగా లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే రూ.23,999 పెట్టాల్సిందే.
స్నోస్టార్మ్ వైట్, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో పోకో ఎక్స్6ను కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
పోకో ఎక్స్6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco X6 Specifications, Features)
ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎక్స్6 పని చేయనుంది. మూడు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నారు. ఇందులో 6.67 అంగుళాల 1.5కే డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పోకో ఎక్స్6 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ కానుంది. ఇందులో 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందుబాటులో ఉన్నాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండటం విశేషం.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా కంపెనీ అందించింది. పోకో ఎక్స్6 బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
పోకో ఎక్స్6తో పాటు పోకో ఎక్స్6 ప్రో కూడా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది. రేసింగ్ గ్రే, స్పెక్టర్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?