Poco X4 Pro 5G Launch: పోకో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.20 వేలలోపే సూపర్ ఫీచర్లు - ఎలా ఉందో చూసేయండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో మనదేశంలో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎక్స్4 ప్రో 5జీ.
పోకో ఎక్స్4 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. పోకో ఎక్స్4 సిరీస్‌లో భాగంలో ఈ ఫోన్ లాంచ్ చేశారు. ఈ కొత్త పోకో ఫోన్ గతంలో వచ్చిన పోకో ఎక్స్3 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా లాంచ్ అయింది. ఇక పోకో ఎక్స్4 ప్రో 5జీలో 120 హెర్ట్జ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో గ్లాస్ బాడీని అందించారు. మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్‌మీ 9 ప్రో 5జీ, మోటో జీ71 5జీ, వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. లేజర్ బ్లూ, లేజర్ బ్లాక్, పోకో ఎల్లో రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 5వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు లేదా క్రెడిట్ ఈఎంఐల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, పోకో ఎక్స్3 ప్రో వినియోగదారులకు అదనంగా రూ.3,000 తగ్గింపు లభించనుంది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎక్స్4 ప్రో 5జీ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది.
8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై పోకో ఎక్స్4 ప్రో 5జీ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ3 సెన్సార్ ఉండగాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పోకో అందించింది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 205 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?