అన్వేషించండి

Oppo Reno 7 5G: ఒప్పో రెనో కొత్త సిరీస్ వచ్చేసింది.. ఈసారి 5జీ ఫోన్లు.. సూపర్ కెమెరాలు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అదే ఒప్పో రెనో 7 5జీ.

ఒప్పో రెనో 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో రెనో 7 ఎస్ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. వీటన్నిటిలోనూ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలను అందించారు. హోల్ పంచ్ డిజైన్ కూడా వీటిలో ఉంది.

ఒప్పో రెనో 7 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 యువాన్లు(సుమారు రూ.31,500)గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా(సుమారు రూ.35,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,500) ఉంది.

ఒప్పో రెనో 7 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు(సుమారు రూ.43,200)గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా(సుమారు రూ.46,700) నిర్ణయించారు.

ఒప్పో రెనో 7 ఎస్ఈ 5జీ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లు(సుమారు రూ.25,700)గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగా(సుమారు రూ.28,000) నిర్ణయించారు. ఈ మూడు ఫోన్లు మార్నింగ్ గోల్డ్, స్టార్ రెయిన్ విష్, స్టారీ నైట్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.

ఒప్పో రెనో 7 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 60W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లుగానూ, బరువు 185 గ్రాములుగానూ ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెన్సార్‌ను అందించారు.

5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మిగతా ఫీచర్లన్నీ ఒప్పో రెనో 7 5జీ తరహాలోనే ఉన్నాయి.

ఒప్పో రెనో 7 ఎస్ఈ 5జీ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనుంది. 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలే అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెల్ఫీ కెమెరాను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గానే ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మిగతా ఫీచర్లన్నీ పై రెండు ఫోన్ల తరహాలోనే ఉన్నాయి.

Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP DesamSunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండCase Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
YS Sharmila : వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Embed widget