Oppo Enco M32 Green: ఒప్పో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ వచ్చేశాయ్.. ధర అంత తక్కువా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త ఇయర్‌ఫోన్స్ లాంచ్ చేసింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త ఆడియో ఉత్పత్తిని లాంచ్ చేసింది. గత నెలలో లాంచ్ చేసిన ఒప్పో ఎంకో ఎం32 నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌లో కొత్త కలర్ వేరియంట్ లాంచ్ అయింది. గతంలో ఇవి బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లాంచ్ కాగా.. ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటిలో ఇండిపెండెంట్ సౌండ్ కేవిటీని అందించారు. ఇవి అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాయి. స్పష్టమైన కాలింగ్ కోసం ఏఐ కాల్-నాయిస్- రిడక్షన్ అల్గారిథమ్‌తో ఒప్పో వీటిని డిజైన్ చేసింది.
ఒప్పో ఎంకో ఎం32 ధర
గతంలో లాంచ్ అయిన ఒప్పో ఎంకో ఎం32 నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,799గా ఉంది. అయితే అవి బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు లాంచ్ అయిన గ్రీన్ కలర్ వేరియంట్ ధరను కూడా రూ.1,799గానే నిర్ణయించారు. అమెజాన్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో ఎంకో ఎం32 స్పెసిఫికేషన్లు
ఒప్పో ఎంకో ఎం32 ఇయర్‌ఫోన్లలో 10mm టైటానియం కోటెడ్ కాంపోజిట్ డయాఫ్రాగమ్ డైనమిక్ డ్రైవర్లను అందించారు. ఇవి స్పష్టమైన శబ్దాన్ని వినియోగదారులకు అందించగలవు. ఇవి ఏఏసీ ఆడియోను సపోర్ట్ చేయనున్నాయి. ఒప్పో ఎంకో ఎం32 ఇయర్‌ఫోన్లలో హాల్ మాగ్నెటిక్ స్విచ్‌ను అందించారు. ఈ రెండు ఇయర్‌బడ్స్‌ను ఒకదానితో ఒకటి మ్యాగ్నెట్ ద్వారా అతికించినప్పుడు మ్యూజిక్ పాజ్ అవుతుందని, వాటిని విడదీసినప్పుడు ఆటోమేటిక్‌గా మ్యూజిక్ ప్లే అవుతుందని ఒప్పో తెలిపింది..
ఈ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌లో వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, కాల్ కంట్రోల్.. ఇలా మూడు బటన్లు అందించారు. వీటితోపాటు మ్యూజిక్ కంట్రోలింగ్, వాయిస్ అసిస్టెంట్ కోసం మల్టీఫంక్షన్ బటన్ కూడా ఇందులో ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం వీటిలో ఐపీ55 రేటింగ్‌ను అందించారు. వీటిలో 220mAh బ్యాటరీని కూడా కంపెనీ అందించింది. ఇవి ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేయనున్నాయి. యూఎస్‌బీ టైప్-సీ కేబుల్ ద్వారా కేవలం 35 నిమిషాల్లోనే వీటిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి వీటిని పూర్తిగా చార్జ్ చేస్తే 28 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి.
View this post on Instagram