అన్వేషించండి

Oppo A3 5G: రూ.16 వేలలోపే ఒప్పో 5జీ ఫోన్ - ఏ3 మార్కెట్లోకి వచ్చేసింది!

Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఏ3 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Oppo A3 5G Launched: ఒప్పో ఏ3 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. బడ్జెట్ ఏ-సిరీస్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందించారు. 6 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను ఈ ఫోన్‌లో చూడవచ్చు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఒప్పో ఏ3 5జీ ధర (Oppo A3 5G Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మనదేశంలో లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు. నెబ్యులా రెడ్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,600 వరకు 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. మొబిక్విక్ వాలెట్ యూజర్లకు రూ.500 క్యాష్‌బ్యాక్‌గా వేస్తామని కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఒప్పో ఏ3 5జీ స్పెసిఫికేషన్లు (Oppo A3 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఏ3 5జీ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 78 డిగ్రీలు అని కంపెనీ అంటోంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. దీంతో పాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా అందించారు. యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, ఈ కంపాస్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. 

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్‌ను కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. దీంతో పాటు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కూడా అందించారు. ఈ ఫోన్ మందం 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget