Oppo A16e Launched: రూ.10 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - బడ్జెట్ ఫోన్ కావాలనుకునేవారికి మంచి చాయిస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ16ఈ.
ఒప్పో ఏ16ఈ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఒప్పో ఏ16కు టోన్ డౌన్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
ఒప్పో ఏ16ఈ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,990గా ఉంది.
ఒప్పో ఏ16ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, పిక్సెల్ డెన్సిటీ 269పీపీఐగానూ ఉంది.
4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4230 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా... బరువు 175 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
View this post on Instagram