అన్వేషించండి

OnePlus Watch 2 : అదిరిపోయే ఫీచర్లతో OnePlus వాచ్ 2 వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్

OnePlus Watch : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ వాచ్​ను దేశీ మార్కెట్​కు పరిచయం చేసింది. 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో OnePlus వాచ్ 2ను అందుబాటులోకి తెచ్చింది.

OnePlus Watch 2 : ప్రముఖ చైనీస్ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన వచ్చే ప్రొడక్టుకు  దేశీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఆ సంస్థ నుంచి తాజాగా అదిరిపోయే ఫీచర్స్​తో కొత్త స్మార్ట్ వాచ్​ను లాంచ్ అయ్యింది.  బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లోOnePlus తన సెకెండ్ జెనరేషన్ వాచ్‌ను ఆవిష్కరించింది. OnePlus Watch 2 పేరుతో ఈ స్మార్ట్ వాచ్​ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ వాచ్ లాంచ్ లైఫ్ బ్యాటరీ, మెరుగైన డిజైన్, చక్కటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాదు, గూగుల్ లేటస్ట్ Wear OS 4తో రన్ అవుతోంది.

OnePlus వాచ్ 2 డిజైన్:

OnePlus 12 సిరీస్ డిజైన్ కు కొనసాగింపుగా OnePlus వాచ్ 2ను రూపొందించారు. ఈ వాచ్ 2.5D నీలంరంగు క్రిస్టల్ కవర్‌తో వస్తుంది. వాచ్ ఛాసిస్ MIL-STD-810H స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. తాజా స్మార్ట్‌ వాచ్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. సుమారు 80 గ్రాముల బరువు ఉంటుంది.  

OnePlus వాచ్ 2 స్పెసిఫికేషన్లు:

OnePlus వాచ్ 2 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్ నెస ను  కలిగి ఉంది. తాజా స్మార్ట్‌ వాచ్ BES 2700 MCU ఎఫిషియెన్సీ చిప్‌ సెట్‌ తో పాటు క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ W5 SoCపై రన్ అవుతుంది. OnePlus వాచ్ 2 Google  Wear OS 4 ఆధారంగా పని చేస్తుంది. 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.   

100 గంటల బ్యాటరీ బ్యాకప్:

OnePlus వాచ్ 2 500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 'స్మార్ట్ మోడ్'లో 100 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. నిరంతరం ఉపయోగిస్తే 48 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం ఉంటుంది. 7.5W VOOC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో వాచ్ 2ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని OnePlus వెల్లడించింది.  

భారత్ లో OnePlus వాచ్ 2 ధర ఎంత అంటే?:

OnePlus వాచ్ 2 ధర భారత్ లో రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది Amazon, Flipkart, Reliance, Cromaతో పాటు OnePlus అధికారిక స్టోర్లు సహా అన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మార్చి 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అవుతుంది.  

OnePlus వాచ్ 2 ఓపెనింగ్ ఆఫర్లు:

OnePlus ICICI బ్యాంక్ OneCardతో కొనుగోలు చేసినట్లు అయితే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.  ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 మధ్యన రెడ్ కేబుల్ క్లబ్‌కు తమ డివైజ్ ను లింక్ చేసే కస్లమర్లకు అదనంగా మరో రూ. 1000 వరకు తగ్గింపు ఇవ్వనుంది.  

Read Also: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget