Lenovo Thinkbook Transparent Display: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!
Lenovo Transparent Dispay Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. అదే లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే.
Transparent Display Laptop: టెక్ ప్రపంచంలో అతిపెద్ద ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 సోమవారం ప్రారంభమైంది. ఈ సంవత్సరం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆధునిక సాంకేతికతతో తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన లెనోవో కంపెనీ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే, కీబోర్డ్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది.
లెనోవో కొత్త ల్యాప్‌టాప్
లెనోవో లాంచ్ చేసిన ఈ ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ పేరు లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. ఇందులో కంపెనీ 17.3 అంగుళాల బెజెల్ లెస్ స్క్రీన్‌ను అందించింది. 720పీ రిజల్యూషన్‌తో మైక్రో ఎల్ఈడీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. ఫ్లోటింగ్ ఫుట్‌ప్యాడ్ డిజైన్‌ను కలిగి ఉన్న ట్రాన్స్‌పరెంట్ కీబోర్డ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది.
ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే, కీబోర్డ్‌తో పాటు లెనోవో ఈ ల్యాప్‌టాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్ (AIGC)ని కూడా చేర్చింది. అయితే లెనోవో దాని ట్రాన్స్‌పరెంట్ ల్యాప్‌టాప్ కాన్సెప్ట్‌ను ఇప్పుడే డిస్‌ప్లే చేసింది. వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయడానికి కొంతకాలం వేచి ఉండాలి.
ఈ ల్యాప్‌టాప్ ఛాసిస్‌పై కెమెరా ఉంది. దీని ద్వారా ఏఐని ఉపయోగించి, కెమెరా ముందున్న వస్తువును తాలూకు డిజిటల్ వెర్షన్‌ను ల్యాప్‌టాప్‌లో ప్రదర్శిస్తుంది. ఈ లెనోవో ల్యాప్‌టాప్‌లో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ గురించి చెప్పాలంటే ఇది విండోస్ 11పై నడుస్తుంది. ఈ ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏమిటంటే దాని డిస్‌ప్లే పారదర్శకంగా ఉంటుంది. దీని కీబోర్డ్ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇది అవసరమైనప్పుడు లేజర్ కీలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ కీబోర్డ్ స్టైలిష్ సపోర్ట్‌తో స్కెచ్‌ప్యాడ్‌గా కూడా పనిచేస్తుంది. అంటే మీరు ఈ ల్యాప్‌టాప్‌లో ఏదైనా టైప్ చేసినప్పుడు, మీరు బటన్‌కు సంబంధించిన ఫిజికల్ టచ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. ఈ ల్యాప్‌టాప్‌లో టైప్ చేయడానికి వినియోగదారులు ఫ్లాట్ సర్ఫేస్‌ను పొందుతారు. అందువల్ల ఇది టచ్ డిస్ప్లేగా కూడా పని చేస్తుంది.
థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లేలోని డిస్‌ప్లే ప్యానెల్ మైక్రోఎల్‌ఈడీ టెక్నాలజీతో తయారు అయిందని లెనోవా ధ్రువీకరించింది. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 1000 నిట్‌ల ప్రకాశంతో వస్తుంది. దీని కారణంగా వినియోగదారులు ఈ ల్యాప్‌టాప్‌ను బలమైన సూర్యకాంతిలో ఇండోర్, అవుట్‌డోర్‌లో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
మరోవైపు రియల్‌మీ త్వరలో భారతదేశంలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ పేరు రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. దీని లాంచ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ మార్చిలో భారతదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ ఈ ఫోన్ లాంచ్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?