By: ABP Desam | Updated at : 06 Mar 2022 10:28 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. (Image Credits: OnePlus)
OnePlus Nord 3: వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. గతేడాది జులైలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ఒప్పో 150W సూపర్‌వూక్ చార్జింగ్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ టెక్నాలజీ త్వరలో రానున్నట్లు ఒప్పో ప్రకటించింది.
2022 ద్వితీయార్థంలో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఈ టెక్నాలజీ అందించనున్నట్లు పీట్ లా తెలిపారు. ఆండ్రాయిడ్ సెంట్రల్ కథనం ప్రకారం... వన్‌ప్లస్ నార్డ్ 3లో 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు మాత్రం తెలియరాలేదు.
ఇదే విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా తెలిపారు. వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని ముకుల్ శర్మ పేర్కొన్నారు. మే నెలాఖరులో లేదా జూన్ నెల ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కానుందని ముకుల్ శర్మ అభిప్రాయపడ్డారు.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో రియల్‌మీ కూడా 150W అల్ట్రా డార్ట్ చార్జ్ టెక్నాలజీని పరిచయం చేసింది. త్వరలో లాంచ్ కానున్న రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 150W అల్ట్రా డార్ట్ చార్జ్ టెక్నాలజీని అందించనున్నారు. రియల్‌మీ జీటీ నియో 3 ఆధారంగానే వన్‌ప్లస్ నార్డ్ 3ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 10 ప్రో కూడా ఇతర మార్కెట్లలో త్వరలో లాంచ్ కానుంది. 2021లో మొత్తంగా 1.1 కోట్ల వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్లు కూడా మొత్తంగా కోటి యూనిట్ల సేల్ మార్కును దాటాయి.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!
PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?
Oppo Reno 8Z: ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?
Realme 9i 5G: రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Philips Smart TV: సూపర్ డిస్ప్లేలతో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన ఫిలిప్స్ - ధర ఎంతంటే?
ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ