OnePlus Nord 3 Price Drop: వన్‌ప్లస్ నార్డ్ 3పై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు కొనవచ్చంటే?
OnePlus Nord 3 Price Cut: వన్‌ప్లస్ నార్డ్ 3 ధర మనదేశంలో భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు.
OnePlus Nord 3 Price in India: వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో భారీగా తగ్గించారు. 2023 జులైలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ బడ్జెట్ నార్డ్ సిరీస్‌లో దీన్ని లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించడం విశేషం.
వన్‌ప్లస్ నార్డ్ 3 ధర, తగ్గింపు వివరాలు
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను లాంచ్ అయినప్పుడు రూ.33,999గా నిర్ణయించారు. ఇప్పుడ దీని ధర రూ.29,999కు వచ్చింది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.37,999గా ఉంది. ఇప్పుడు రూ.33,999కు వచ్చింది మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా...
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 3 పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్‌డీఆర్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందించారు. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగా వర్క్ అవ్వనుంది. 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు వన్‌ప్లస్ నార్డ్ 3లో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
మరోవైపు కొత్త సంవత్సరం మొదటి నెలలో అంటే 2024 జనవరిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. బడ్జెట్, మిడ్, ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం వరకు ప్రతి కేటగిరీలో ఒక ఫోన్ లాంచ్ కానుంది. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే 2024 మొదటి నెలలో మీ కోసం అనేక ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి మొదటి వారంలోనే ఐదు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!