OnePlus 13: వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఆరోజే - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ!
OnePlus 13 Launch Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అదే వన్‌ప్లస్ 13. ఈ ఫోన్ అక్టోబర్ 31వ తేదీన లాంచ్ కానుంది.
OnePlus 13 Launch Date in India: వన్‌ప్లస్ అభిమానులకు ఈరోజు ఒక పెద్ద శుభవార్త వచ్చింది. ఈ కంపెనీ తదుపరి ప్రీమియం ఫోన్ సిరీస్ అంటే వన్‌ప్లస్ 13 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ డేట్ కూడా వెల్లడి అయింది.
వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఎప్పుడు?
వన్‌ప్లస్ 12కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13 ఈ నెలాఖరులో విడుదల కానుంది. మీడియా నివేదికల ప్రకారం వన్‌ప్లస్ తన కొత్త ప్రీమియం ఫోన్‌లో క్వాల్‌కాం అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించబోతోంది. ఇది కాకుండా మునుపటి అనేక వన్‌ప్లస్ ఫోన్ సిరీస్‌ల్లో చూసినట్లుగా, ఈ ఫోన్ కెమెరా సెటప్‌ను కూడా హాజిల్‌బ్లాడ్ (Hasselblad) సిద్ధం చేస్తుంది.
వన్‌ప్లస్ తెలుపుతున్న దాని ప్రకారం వన్‌ప్లస్ 13 మొదట దాని హోమ్ మార్కెట్లో లాంచ్ కానుంది. చైనాలో 2024 అక్టోబర్ 31వ తేదీన ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ప్రపంచంలోని ఇతర దేశాలలో, భారతదేశంలో కూడా లాంచ్ కానుది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే విడుదల అయింది. ఇందులో దాని మూడు కలర్ వేరియంట్లను చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను అబ్సిడియన్ బ్లాక్, బ్లూ మూమెంట్, వైట్ డ్యూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వన్‌ప్లస్ 13 లాంచ్ టీజర్ కూడా చైనాలో విడుదల అయింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ చైనా కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరగనుందని టీజర్‌లో పేర్కొన్నారు. ఈ ఫోన్‌లో ఉన్న స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఇప్పటివరకు లీక్ అయిన రిపోర్ట్‌ల ప్రకారం ఇది ప్రపంచంలోనే మొదటి సెకండ్ జెన్ 2కే బీవోఈ ఎక్స్2 కర్వ్‌డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వినియోగదారుల స్క్రీన్ అనుభవాన్ని చాలా అద్భుతంగా చేస్తుంది. ఇది కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (8 జెన్ 4) ద్వారా ఫోన్ పని చేయనుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడుతుందని చెబుతున్నారు. ఈ సెటప్‌లో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఎల్‌వైటీ808 సెన్సార్‌ను అందించనుందని తెలుస్తోంది. రెండోది 50 మెగాపిక్సెల్ జేఎన్ఎస్ సెన్సార్, మూడోది పెరిస్కోప్ సెన్సార్ కావచ్చని సమాచారం. అయితే దీని గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేం.
వన్‌ప్లస్ 13 స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ జంబో బ్యాటరీ ఉండనుందని భావిస్తున్నారు. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఐపీ68/ఐపీ69 రేటింగ్‌ను కూడా పొందవచ్చని తెలుస్తోంది. ఇది ఫోన్‌ను నీరు, ధూళి సమస్యల నుండి పూర్తిగా సురక్షితంగా ఉంచగలదు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే