OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?
OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది.
OnePlus New Phone: వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ మనదేశంలో రేపు (జనవరి 23వ తేదీ) లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. వన్‌ప్లస్ 12ఆర్‌తో పాటు ఈ ఫోన్ లాంచ్ కానుంది. సరిగ్గా లాంచ్‌కు ఒక్కరోజు ముందు దీని ధర ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన సేల్ జనవరి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గతేడాది డిసెంబర్‌లో మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5400 ఎంఏహెచ్ కాగా 100W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ 12 సపోర్ట్ చేయనుంది.
వన్‌ప్లస్ 12 ధర (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధరను ఎక్స్/ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో లీక్ చేశారు. అభిషేక్ తెలుపుతున్న వివరాల ప్రకారం... 12 జీబీ ర్యామ్‌తో రానున్న బేస్ వేరియంట్ ధర రూ.64,999గా నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్‌తో వచ్చే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.69,999గా ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ సేల్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ ఈవెంట్ జనవరి 23వ తేదీన మనదేశంలో జరగనుంది. అమెజాన్‌లో వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ముందు నుంచి అమెజాన్‌నే పార్ట్‌నర్‌గా ఉంటోంది. కాబట్టి అమెజాన్‌లోనే వన్‌ప్లస్ ఫోన్లు సేల్‌కు వస్తాయి.
వన్‌ప్లస్ 12 గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 4,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.50,700) నిర్ణయించారు. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. పేల్ గ్రీన్, రాక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ చైనా మార్కెట్లో అడుగు పెట్టింది.
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుందని తెలుస్తోంది. ఇందులో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారని సమాచారం. క్వాల్‌కాం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వన్‌ప్లస్ 12లో ఉండనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ కెమెరాలు ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ కెమెరాల్లో ప్రధాన సెన్సార్ సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుందని తెలుస్తోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలెర్ట్ స్లైడర్ కూడా వన్‌ప్లస్ 12లో చూడవచ్చు. 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!