OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
OnePlus Offers: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందించింది. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది.
OnePlus 11 5G Price Cut: వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతేడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 11 5జీ రన్ కానుంది. దీని తర్వాతి వెర్షన్ అయిన వన్‌ప్లస్ 12 5జీ మనదేశంలో 2024 జనవరిలో లాంచ్ అయింది.
వన్‌ప్లస్ 11 5జీ ధర (OnePlus 11 5G Price)
ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో రూ.56,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఇదే వేరియంట్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లో రూ.51,999 ధరకే అందుబాటులో ఉంది. అంటే దీనిపై ఏకంగా రూ.5,000 తగ్గింపు లభించిందన్న మాట. ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.5,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, వన్ కార్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓవరాల్‌గా అన్నీ కలుపుకుంటే రూ.42 వేల ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
వన్‌ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (OnePlus 11 5G Specifications and Features)
ఇందులో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా లభించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 11 5జీ రన్ కానుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
వన్‌ప్లస్ 11 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, రింగ్ మోడ్స్‌ను మార్చడం కోసం అలెర్ట్ స్లైడర్ కూడా ఉన్నాయి. 5జీ, 4జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ 2.0 టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది