By: ABP Desam | Updated at : 26 Dec 2021 07:47 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ 10 సిరీస్ ఫోన్లు జనవరిలో లాంచ్ కానున్నాయి.
2022లో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్లలో వన్‌ప్లస్ 10 సిరీస్ కూడా ఉంది. ఇందులో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ఎలా ఉండనుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫోన్ జనవరిలోనే లాంచ్ కానుందని కంపెనీ సీఈవో పీట్ లా అధికారికంగా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. లాస్ వెగాస్‌లో జరగనున్న సీఈఎస్ (2022) కార్యక్రమంలో ఈ ఫోన్‌ని కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
పీట్ లా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ జనవరిలో లాంచ్ కానుంది. అయితే సరిగ్గా ఏ తేదీన లాంచ్ కానుందనే విషయాన్ని మాత్రం తెలపలేదు. 2022 మొదటి త్రైమాసికంలోనే ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. అయితే మొదట మాత్రం సొంత దేశం చైనాలో లాంచ్ కానుంది.
ఈ సీఈఎస్ కార్యక్రమం జనవరి 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య జరగనుంది. అమెరికాలోని లాస్ వెగాస్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. 2021లో కరోనావైరస్ కారణంగా సీఈఎస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అయితే ఈసారి అలా కాకుండా ముఖాముఖిగా ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రముఖ టిప్‌స్టర్ మ్యాక్స్ జంబోర్ తెలుపుతున్న దాని ప్రకారం.. వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్ జనవరి 5వ తేదీన జరగనుంది. అయితే లాస్ వెగాస్‌లోని సీఈఎస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం ఉన్నప్పటికీ.. వన్‌ప్లస్ ఏమేం లాంచ్ చేయనుందో మాత్రం తెలియరాలేదు.
ఇప్పుడు వినిపిస్తున్న వార్తలే నిజమైతే వన్‌ప్లస్ 10 ప్రో సిరీస్ మొత్తం ఈ ఈవెంట్లోనే లాంచ్ అయింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వన్‌ప్లస్ 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10ప్రోలతో పాటు.. వన్‌ప్లస్ 10ఆర్‌టీ కూడా లాంచ్ అవుతుందా.. ఈసారి రెండు స్మార్ట్ ఫోన్లకే పరిమితం అవుతారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం
Xiaomi 12S Ultra: వన్‌ప్లస్, యాపిల్‌తో పోటీ పడే ఫోన్ లాంచ్ చేసిన షియోమీ!
Xiaomi 12S Pro: మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో వచ్చిన షియోమీ 12ఎస్ ప్రో - ఎలా ఉందో తెలుసా?
Xiaomi 12S: 512 జీబీ స్టోరేజ్‌తో షియోమీ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
OnePlus TV 50 Y1s Pro: వన్‌ప్లస్ కొత్త టీవీ దిగింది - 50 ఇంచుల టీవీల్లో బెస్ట్!
EV Fire Incidents: తయారీ లోపంతోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు- తేల్చిన కేంద్రం - నెలరోజుల్లో చర్యలు !
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?
Rain Alert: నేడు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఏపీ, తెలంగాణకు IMD ఎల్లో అలర్ట్