DART Spacecraft: ఓ మైగాడ్, గ్రహశకలాన్ని ఢీకొట్టేందుకు రూ.2 వేల కోట్లతో స్పేస్ క్రాఫ్ట్ - మూహూర్తం ఫిక్స్!
అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక ముందడుగు వేయబోతుంది. భవిష్యత్ లో భూమికి ఇబ్బంది కలిగించే ఆస్టరాయిడ్స్ ను అడ్డు తొలిగించడంలో భాగంగా DART మిషన్ పరీక్షకు సిద్ధం అయ్యింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA అత్యతం కీలక పరీక్షకు రెడీ అవుతోంది. గ్రహ శకలాల నుంచి భూమికి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కీలకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏదైనా ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్నట్లయితే.. వెంటనే దాన్ని కనిపెట్టి.. మార్గం మధ్యలోనే ధ్వంసం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధకులు DART (డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ సిస్టమ్) అనే స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేశారు. ఈ నెల 26న డైమోర్ఫోస్ ఆస్టరాయిడ్ మీద ఈ అంతరిక్ష నౌక దాడి చేయనుంది.
వాస్తవానికి చాలా గ్రహ శకలాలు మన భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం రావచ్చని ముందే గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఈ DART స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడం మూలంగానే డైనోసార్లు అంతరించిపోయాయని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి ముప్పు నుంచి భూమిని కాపాడేందుకే నాసా ఈ అంతరిక్ష నౌకను రూపొందించింది. ఏకంగా 330 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2,635 కోట్లు) వెచ్చించి మరీ ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను తయారు చేశారు. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. గ్రహశకలాన్ని ఢీకోగానే ఆ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ధ్వంసమైపోతుంది.
DART అంటే ఏమిటి?
DART అనేది భూమిని ఢీకొనేందుకు వచ్చే మార్గంలో ఉన్న ఏదైనా గ్రహశకలాన్ని దారి మళ్లించే లక్ష్యంతో NASA నిర్మించిన అంతరిక్ష నౌక. మేరీల్యాండ్‌లోని లారెల్‌లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో నిర్మించబడిన DART స్పేస్ క్రాఫ్ట్. భూమిని చేరుకోవడానికి రెడీగా ఉన్న ఆస్టరాయిడ్ వైపు DART స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది. దాని చుట్టూ చిన్న ఉపగ్రహాన్ని (క్యూబ్‌శాట్) మోహరిస్తుంది. టార్గెట్ చేసిన గ్రహశకలం చుట్టూ తిరుగుతుంది. సమాచారాన్ని సేకరిస్తుంది. డేటా, చిత్రాలను సేకరించిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ఆస్టరాయిడ్‌లోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత గ్రహశకలాన్ని బ్లాస్ట్ చేస్తుంది. భూమికి జరగబోయే నష్టాన్ని నివారిస్తుంది.
DART మిషన్ ఏ ఆస్టరాయిడ్ ని ధ్వంసం చేయనుంది?
డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ పనితీరును పరిశీలించేందుకు నాసా శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు. ఇందుకు 'డిమోర్ఫోస్' అనే ఉల్కను టార్గెట్ చేసుకున్నారు. డైమోర్ఫోస్ అనేది బైనరీ గ్రహశకలం వ్యవస్థలో ఒక భాగం. అంటే రెండు గ్రహశకలాలు ఒకదానికొకటి కక్ష్యలో ఉన్నాయి. డిడిమోస్ ప్రధాన గ్రహశకలం కాగా.. డైమోర్ఫోస్ దాని ఉపగ్రహం లాంటిది. 1996లో ఈ గ్రహశకలం మొదటిసారి కనుగొనబడింది. ఈ గ్రహశకలం జంట కొన్ని సంవత్సరాలకు భూ గ్రహం మీదుగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో దీని టార్గెట్ గా DART మిషన్ పరీక్షకు నాసా రెడీ అవుతుంది.
దాడి ఎప్పుడు చేయబోతుందంటే?
NASAకు సంబంధించిన DART స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పటికే డిమోర్ఫోస్ దగ్గరికి వెళ్తుంది. ఇది గత సంవత్సరం నవంబర్ 24న వాండెన్‌బర్గ్ స్పేస్ఫర్స్ నుంచి SpaceX ఫాల్కన్ 9 రాకెట్‌లో బయల్దేరింది. ఈ నెల(సెప్టెంబర్) 26న చిన్న డైమోర్ఫోస్ ఆస్టరాయిడ్ పై దాడి చేయబోతుంది. డైమోర్ఫోస్ గ్రహశకలంతో పోలిస్తే DART స్పేస్‌క్రాఫ్ట్ చాలా చిన్నది అయినప్పటికీ, వ్యోమనౌక 25,000 kmph వేగంతో ప్రయాణిస్తున్న గ్రహశకలాన్ని ఢీకొట్టగలదు. ఈ టెస్ట్ మిషన్ సక్సెస్ అయితే గ్రహ రక్షణ వ్యవస్థలో తొలి అడుగు పడే అవకాశం ఉంది.
On Sept. 26, @NASA’s #DARTMission will impact an asteroid, which poses no threat to Earth, as humanity’s first test for #PlanetaryDefense. 🌎
— NASA Asteroid Watch (@AsteroidWatch) August 23, 2022
Learn more on how to join us for a multitude of events starting Sept. 12 as we countdown to DART impact: https://t.co/OhqJLa7LST pic.twitter.com/C6tXz8VD0K
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!