Motorola Edge 20 Fusion: మోటొరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే..
మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 20: 9 ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది.
మోటొరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్. మోటొరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్‌తో పాటు ఇది కూడా ఇండియాలో లాంచ్ అయింది. మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 20: 9 ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ, శాంసంగ్ గెలాక్సీ ఎం 42, ఎంఐ 10ఐ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Want a phone that matches your edgy personality? #motorolaegde20fusion is for you, featuring 108MP Quad Function Camera System, 90Hz 10-bit AMOLED Display & more. Price starts at just ₹21,499. Sale starts from 27th Aug, 12 PM on @Flipkart. #FindYourEdge https://t.co/uwCKO3S3mU pic.twitter.com/OPbqsuHifC
— Motorola India (@motorolaindia) August 17, 2021
రూ.21 వేల లోపే ధర..
ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ సైబర్ టీల్, ఎలక్ట్రిక్ గ్రాఫైట్ రంగులలో అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డుల మీద ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
Explore new boundaries, push them or make your own with the all-new #motorolaedge20fusion. #FindYourEdge with its 108MP Quad Function Camera, 90Hz AMOLED Display, MediaTek Dimensity 800U Processor & more. Sale starts on 27th Aug, 12 PM on @Flipkart. https://t.co/IluJwhgj3C
— Motorola India (@motorolaindia) August 17, 2021
ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫీచర్లు..
- డ్యూయల్ సిమ్ (నానో) మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఎక్స్ (MyUX) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
- ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే అందించారు.
- యాస్పెక్ట్ రేషియో 20:9గా.. రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉండనుంది.
- ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించారు.
- 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.motor
- ఇందులో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్..
మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌గా ఉంది. టర్బో పవర్ 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంటుంది. దీని బరువు 185 గ్రాములుగా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఎన్ఎఫ్‌సీ ఉండనున్నాయి. యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రొక్సిమిటీ సెన్సార్ వంటివి ఇందులో ఉన్నాయి.
Also Read: Jio Phone Next: రూ.4 వేలలోపు ధరలో జియో స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్‌లో రిలీజ్.. స్పెసిఫికేషన్లు లీక్