అన్వేషించండి

Jio Phone Next: రూ.4 వేలలోపు ధరలో జియో స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్‌లో రిలీజ్.. స్పెసిఫికేషన్లు లీక్

Jio Phone Next Features Leaked: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న జియో ఫోన్ నెక్స్ట్ ఫీచర్లు లీకయ్యాయి. వీటి ప్రకారం.. ఈ ఫోన్ ధర రూ.4000లోపే ఉండే అవకాశం ఉంది.

భారతదేశ నంబర్ 1 టెలికాం ఆపరేటర్ జియో నుంచి అతి తక్కువ ధరలో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. గూగుల్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ఈ ఏడాది జూన్‌లో రిలయెన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పేరు జియో ఫోన్ నెక్స్ట్ (JioPhone Next). సెప్టెంబర్‌లో విడుదల కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.4000లోపే ఉండే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 10న విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 

Jio Phone Next: రూ.4 వేలలోపు ధరలో జియో స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్‌లో రిలీజ్.. స్పెసిఫికేషన్లు లీక్

Also Read: Galaxy Z Fold, Z Flip: శాంసంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

సింగిల్ రియర్ కెమెరా..

వీటి ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) సహాయంతో పనిచేయనుంది. ఇందులో సింగిల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. రిలయెన్స్ సంస్థల 44వ వార్షిక సదస్సు (ఏజీఎం) వేదికగా.. సంస్థ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ ఈ ఫోన్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోనుగా దీనిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. 

ఎక్స్ డీఏ డెవలపర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిషాల్ రెహ్మన్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించి పలు ట్వీట్లు చేశారు. దీని ప్రకారం చూస్తే.. జియో నుంచి రానున్న ఈ చవకైన ఫోన్ మోడల్ నంబర్ LS-5701-Jగా ఉండనుంది. ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్ అయిన క్వాల్‌కాం అడ్రినో 308 జీపీయూతో పనిచేయనుంది. సాధారణంగా ఈ ప్రాసెసర్లను తక్కువ బడ్జెట్ ఫోన్లలో ఉపయోగిస్తారు. 

దీని వెనుకవైపు కెమెరా 13 మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ సామర్థ్యంతో రానున్నాయి. ఇందులో DuoGo యాప్ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉండనుంది. ఈ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 720x1,440 పిక్సెల్స్‌గా ఉండనుందని తెలుస్తోంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్ ఉండనున్నాయి. 

Also Read: Cyber Crime: హాయ్.. ఆగస్టు 15 సందర్భంగా ఆఫర్‌ మెసేజ్‌లు వస్తున్నాయా..? వాటి కంటే ముందు ఇది చదవండి

Also Read: WhatsApp Tricks: వాట్సాప్ లో మెసేజ్ చేసి డిలిట్ చేశారా? ఏం పర్లేదు.. ఇలా చూసేయోచ్చు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget