WhatsApp Tricks: వాట్సాప్ లో మెసేజ్ చేసి డిలిట్ చేశారా? ఏం పర్లేదు.. ఇలా చూసేయోచ్చు..
మనకు వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. మనం వాటిని చూడకముందే డిలిట్ కొట్టేస్తారు. మనసులోనేమో.. ఏం మెసేజ్ చేశారా అని తెలుసుకోవాలని ఉంటుంది. అలా.. డిలిటేడ్ మెసేజ్ లు చూసుకోవచ్చు తెలుసా.
ఏదో పనిలో బిజీగా ఉంటాం. అవతలి వారు.. ఏదో.. మెసేజ్ చేస్తారు.. మళ్లీ మనం చూసి ఏం అనుకుంటామోనని వెంటనే డిలిట్ చేస్తారు. ఇక ఆ మెసేజ్ ఏంటో వాళ్లు చెప్పారు. మనం ఎంత ప్రయత్నించిన తెలియదు. కానీ అలా డిలిట్ చేసిన మెసేజ్ లను చూసుకునే ఛాన్స్ ఉంది. ఎలా అంటారా?
మనం చదవడం కంటే.. ముందే.. డిలీట్ చేసిన మెసేజ్‌లను డబ్ల్యూఏఎమ్ఆర్(WAMR) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ తో వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్‌ల కూడా మనం డౌన్లోడ్ చేయోచ్చు.
ఈ యాప్ డౌన్ లోడ్ కోసం.. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లాలి. డబ్ల్యూఏఎమ్ఆర్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేయాలి. సంబంధిత సెటప్‌లను యాక్సెప్ట్ చేయాలి. ఏ యాప్ నుంచి మనం డిలీట్ చేసిన డేటాను పొందాలి అనుకుంటున్నామో వాటిని క్యాప్చర్ నోటిఫికేషన్‌ను యాక్సెప్ట్ చేసి.. పొందవచ్చు.
వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి డిలీట్ అయిన సమాచారాన్ని పొందాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఆ తర్వాత డబ్ల్యూఏఎమ్ఆర్ యాప్‌లో వాట్సాప్‌తో పాటు మనం సెలక్ట్ చేసిన అప్లికేషన్ సంబంధించిన డేటాను మేనేజ్ చేసుకోవచ్చు. డిలీట్ అయిన మెసేజ్‌లు, స్టేటస్లు డౌన్లోడ్ చేయడం లాంటి వాటన్నింటికీ మనకు నోటిఫికేషన్లు చూపిస్తుంది.
వాట్సాప్, వాట్సాప్ డిలీటెడ్ మెసేజులు, రీడ్ డిలీటెడ్ మెసేజులు.. డబ్ల్యూఏఎమ్ఆర్లో చూడొచ్చు. ఒకసారి యాక్సెప్ట్ చేశాక సంబంధిత నోటిఫికేషన్లు అన్ని డిస్ప్లేపై వాట్సాప్ నోటిఫికేషన్ల రూపంలోనే అగుపిస్తాయి. కావాల్సిన మీడియా ఫైల్స్, స్టేటస్ డౌన్‌లోడ్‌ను ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే.. దానికి కూడా అప్షన్ ఉంటుంది. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చాక డబ్ల్యూఏఎమ్ఆర్ వాట్సాప్ మెసేజ్‌లపై లుక్ వేసి ఉంచుతుంది.
ఇంకోలా కూడా చేయోచ్చు..
వేరే యాప్ తో కూడా డిలిట్ చేసిన మెసేజ్ లను చూసేందుకు ఛాన్స్ ఉంది. ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి whatsremoved+ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసి.. ఇన్స్టాల్ చేసి ఆ తరువాత పర్మిషన్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తరువాతే మీరు మెసేజ్ లు చూడగలుగుతారు.
ఏ యాప్ లో డిలిటెడ్ డేటా చూడాలనుకుంటున్నారో ఆ యాప్ లకు పర్మిషన్ ఇవ్వాలి. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, వాట్స్ ఆప్ వంటివాటిల్లో డిలీట్ అయిపోయిన మెసేజ్ లు మీరు చూడాలంటె ఆ యాప్ లను యాక్సెస్ చేయడానికి whatsremoved+ యాప్ కు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మీకు ఎలా నోటిఫికేషన్ వస్తుందో.. అలానే.. డిలీట్ అయిన మెసేజ్ లు కూడా whatsremoved+ యాప్ లో సేవ్ అవుతాయి. అవి చూడాలనుకుంటే మీరు whatsremoved+ యాప్ ఓపెన్ చేసి అందులో వాట్సాప్ ను సెలెక్ట్ చేసుకుని చూడాల్సి ఉంటుంది.