అన్వేషించండి

Moto G04: మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్ త్వరలో - రూ.10 వేలలోనే సూపర్ ఫీచర్లతో!

Moto New Phone: మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది.

Moto G04 India Launch: మోటో జీ04 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో వచ్చే వారం లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. మోటో జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉండనుంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

మోటో జీ04 మనదేశంలో ఫిబ్రవరి 15వ తేదీన లాంచ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా క్రియేట్ చేశారు. ఈ పేజీలో స్మార్ట్ ఫోన్ డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు చూడవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. పంచ్ హోల్‌ను సరిగ్గా మధ్యలో అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్ ద్వారా ఫోన్ రన్ అవుతుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఫోన్ 102 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 22 గంటల టాక్ టైమ్‌ను అందించనుందని సమాచారం. డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే స్పీకర్లు ఉండనున్నాయి. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉండనుంది.

ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ధర యూరోప్‌లో 119 యూరోల (సుమారు రూ.10,600) నుంచి ప్రారంభం కానుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర ఇది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపు ధరలోనే ఉండే అవకాశం ఉంది.

మరోవైపు అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ల్యాప్‌టాప్ మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌లో మీడియాటెక్ కొంపానియో ప్రాసెసర్‌ను అందించారు. అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో లాంచ్ అయిందని కంపెనీ తెలిపింది. 180 డిగ్రీల లే ఫ్లాట్ హింజ్డ్ డిస్‌ప్లేతో ఇది లాంచ్ అయింది. ఈ హింజ్డ్ డిస్‌ప్లే ద్వారా వినియోగదారులు ల్యాప్‌టాప్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 15 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 అందించనుంది. మనదేశంలో ఈ ల్యాప్‌టాప్ సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
YSRCP MLCs join TDP: టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
Maoist Party : మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
Advertisement

వీడియోలు

Meta Ray-Ban Glasses Demo Failure | 43,500 ధరతో మెటా కొత్త స్మార్ట్ గ్లాస్సెస్
ఆసియా కప్ నుంచి ఆఫ్ఘన్ ఔట్.. సూపర్-4 లో ఇండియా షెడ్యుల్ ఫైనల్
ఆ వీడియో ఎలా బయటపెడతారు?.. పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్!
టీమ్ జెర్సీలోనూ పీసీబీ కక్కుర్తి.. అవినీతి బయటపెట్టిన పాక్ మాజీ
టీమిండియాలో 3 మార్పులు.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
YSRCP MLCs join TDP: టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
Maoist Party : మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
SBI Scholarship: పేద విద్యార్థులకు SBI బంపర్ ఆఫర్ - 20 లక్షల స్కాలర్ షిప్ - ఇవిగో పూర్తి డీటైల్స్
పేద విద్యార్థులకు SBI బంపర్ ఆఫర్ - 20 లక్షల స్కాలర్ షిప్ - ఇవిగో పూర్తి డీటైల్స్
Nag Ashwin: 'కల్కి 2898AD' నుంచి దీపికా అవుట్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్... కృష్ణుడి డైలాగ్‌తో...
'కల్కి 2898AD' నుంచి దీపికా అవుట్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్... కృష్ణుడి డైలాగ్‌తో...
Fake Death : కోటి 40 లక్షలు ఎగ్గొడదామని చచ్చిపోయాడు - కానీ దొరికిపోయాడు- వీడు జులాయిలో బ్రహ్మానందం టైప్ !
కోటి 40 లక్షలు ఎగ్గొడదామని చచ్చిపోయాడు - కానీ దొరికిపోయాడు- వీడు జులాయిలో బ్రహ్మానందం టైప్ !
Embed widget