అన్వేషించండి

Xiaomi 12 Pro: అదిరిపోయే ఫీచర్లతో సూపర్ ఫోన్ లాంచ్ చేసిన షియోమీ - మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు - మొదటి సేల్‌లో రూ.10 వేలు తగ్గింపు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే షియోమీ 12 ప్రో.

షియోమీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే షియోమీ 12 ప్రో. వన్‌ప్లస్ 10 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22లతో ఇది పోటీ పడనుంది. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు, 120 హెర్ట్జ్ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

షియోమీ 12 ప్రో ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.62,999గానూ, 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.66,999గానూ నిర్ణయించారు.కోచర్ బ్లూ, నోయిర్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మే 2వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మే 2వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది.

ప్రారంభ ఆఫర్ కింద దీనిపై రూ.4,000 తగ్గింపును అందించారు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లేదా ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,000 తగ్గింపు లభించనుంది. అంటే మొత్తంగా రూ.10 వేల తగ్గింపు అందించనున్నారన్న మాట.

షియోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.72 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో స్క్రీన్ సేఫ్టీని అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ టాప్ ప్రాసెసర్ 8 జెన్ 1ని ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్ కాగా... 120W షియోమీ హైపర్ చార్జ్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్విక్ చార్జ్ 4, క్విక్ చార్జ్ 3+, పవర్ డెలివరీ 3.0 చార్జింగ్, 50W వైర్‌లెస్ టర్బో చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, నావిక్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కూడా ఇందులో అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 205 గ్రాములుగా ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget