By: ABP Desam | Updated at : 17 Sep 2022 11:59 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై52టీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
వివో వై52టీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన వివో వై52కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను ఇందులో అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఉంది. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.
వివో వై52టీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,299 యువాన్లుగా (సుమారు రూ.14,900) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.17,000) ఉంది. లేక్ బ్లూ, కోకోనట్ పీచ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో వివో వై52టీ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
వివో వై52టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై వివో వై52టీ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 198 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
Poco M6 Pro 5G: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న 5జీ ఫోన్ రూ.15 వేలలోపే - సూపర్ ఫోన్ దించిన పోకో!
Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>