By: ABP Desam | Updated at : 18 May 2022 06:14 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో ఎక్స్80 సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. (Image Credits: Vivo)
వివో ఎక్స్80 ప్రో, వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ అయ్యాయి. గతంలో లాంచ్ అయిన వివో ఎక్స్70 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ సిరీస్ లాంచ్ అయింది. వివో ఎక్స్80లో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌ను అందించగా... ఎక్స్80 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో సినిమాటిక్ స్టైల్ బొకే, సినిమాటిక్ వీడియో బొకే, 360 డిగ్రీ హారిజన్ లెవల్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉండటం విశేషం.
వివో ఎక్స్80 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. కాస్మిక్ బ్లాక్, అర్బన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో ఎక్స్80 ప్రో ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,999గా ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. కాస్మిక్ బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల సేల్ మే 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
వివో ఎక్స్80 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.78 అంగుళాల 2కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్ 80 ప్రో పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీఎన్వీ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్, 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ షేప్డ్ అల్ట్రా టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు.
వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా... బరువు 219 గ్రాములుగా ఉంది.
వివో ఎక్స్80 స్పెసిఫికేషన్లు
ఇందులో కూడా 6.78 అంగుళాల ఉన్న డిస్‌ప్లేనే అందించారు. కానీ దీని రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
వివో ఎక్స్80లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్866 ఆర్జీబీడబ్ల్యూ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్ 80 పనిచేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా... బరువు 206 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?
Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?
C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా