News
News
X

Vivo V25 5G: సెల్ఫీ కింగ్ ఇదే - 50 మెగాపిక్సెల్ ఫ్రంట్‌కెమెరాతో వివో కొత్త ఫోన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వీ25 5జీ.

FOLLOW US: 

వివో వీ25 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ఓఐఎస్ నైట్ కెమెరాను అందించారు. దీని వెనకవైపు ఫ్లోరైట్ ఏజీ బ్యాక్ ప్యానెల్ ఉంది. ముందువైపు 50 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరాను అందించారు. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది.

వివో వీ25 5జీ ధర
వివో వీ25 5జీ రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి వివో వీ15 5జీ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతోపాటు రూ.2,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందించనున్నారు.

వివో వీ25 5జీ స్పెసిఫికేషన్లు
వివో వీ25 5జీలో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంను అందించారు. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080x2,404 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. సూర్యకాంతి లేదా అల్ట్రా వయొలెట్ కిరణాలు పడినప్పుడు బ్యాక్ ప్యానెల్ రంగు మారనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్‌లు కూడా ఉన్నాయి. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా... బరువు 186 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 15 Sep 2022 09:46 PM (IST) Tags: Vivo New Phone Vivo V25 5G Price in India Vivo V25 5G Features Vivo V25 5G Vivo V25 5G Launched

సంబంధిత కథనాలు

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?