అన్వేషించండి

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.

టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఫాంటం ఎక్స్2 సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేయడానికి సిద్థం అవుతోంది. టెక్నో లాంచ్ చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే. గతేడాది ఏప్రిల్‌లో టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్లాంచ్ అయింది. టెక్నో ఫాంటం ఎక్స్2 సిరీస్‌ను దుబాయ్‌లో కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని టెక్నో ఒక వెబినార్ ద్వారా వెల్లడించింది. రియల్‌మీ, షావోమీ బ్రాండ్లలోని మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.

ఈ సిరీస్‌లో టెక్నో ఫాంటం ఎక్స్2, ఫాంటం ఎక్స్2 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. డిసెంబర్ 7వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. మరింత మెరుగైన కెమెరా ఫీచర్లు ఇందులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టెక్నో పోవా 4 ప్రో ఇటీవలే బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 26,990 బంగ్లాదేశ్ టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,330) నిర్ణయించారు. ఫ్లోరైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి ఇందులో 5 జీబీ వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌ను వర్యువల్‌గా అందించనున్నారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 24 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది. గేమింగ్ ఓరియంటెడ్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TECNO Mobile (@tecnomobile)

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget