అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Samsung Galaxy S24 Ultra: శాంసంగ్ ఎస్24 అల్ట్రా కెమెరా ఫీచర్లు లీక్ - ఈసారి కెమెరా మామూలుగా లేదుగా!

Samsung Galaxy S24 Ultra: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ ఎస్24 అల్ట్రా గురించి వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

 శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా గురించి కొన్ని వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ మోడల్స్ కూడా మార్కెట్లోకి రానున్నాయి. 2024 వరకు ఇవి మార్కెట్లో లాంచ్ కావు. కానీ లీకులు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ కెమెరాల వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 5x జూమ్ ఉన్న 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని గిజ్మోచైనా తన కథనంలో పేర్కొంది. ప్రారంభంలో 10x జూమ్ ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరా అందించాలని అనుకున్నప్పటికీ అవుట్ పుట్ క్వాలిటీ కారణంగా ఆ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీంతోపాటు ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ2ఎస్ఎక్స్ సెన్సార్ కూడా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో అందించిన ఐసోసెల్ హెచ్‌పీ2 సెన్సార్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. లేటెస్ట్ ఐసోసెల్ హెచ్‌పీ2ఎస్ఎక్స్ సెన్సార్‌లో 1/1.3 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్స్ అందించనున్నారని,  అలాగే ఇది 0.6 మైక్రాన్ పిక్సెల్స్‌ను కలిగి ఉండనుందని తెలుస్తోంది.

వినిపిస్తున్న లీకుల ప్రకారం... ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లే అందించనున్నారు. దీని ముందు మోడల్స్ తరహాలో కాకుండా టైటానియం ఫ్రేమ్స్‌తో ఈ ఫోన్ రానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్లపై ఈ ఫోన్ పని చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 6.8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 3088 పిక్సెల్స్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఆక్టా-కోర్ ప్రాసెసర్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌పై పని చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో మీకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget