Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.
![Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో! Samsung Galaxy A23 5G May Launch Soon Check Expected Features Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/28/b90cfbe19858e66d85079c03886cea43_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శాంసంగ్ గతంలో మనదేశంలో గెలాక్సీ ఏ23 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌కు 5జీ వెర్షన్ లాంచ్ కానుంది. దీని 4జీ వెర్షన్‌లో ఉన్న ఫీచర్లే 5జీ వెర్షన్లోనూ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రాసెసర్ మాత్రం కచ్చితంగా 5జీని సపోర్ట్ చేసే ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు.
గెలాక్సీ క్లబ్ కథనం ప్రకారం... శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ వేరియంట్ మొదట యూరోపియన్ మార్కెట్లలో లాంచ్ కానుంది. ఆ తర్వాత మనదేశంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.4 అంగుళాల హెచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ కెమెరాల్లో డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ వంటి ఫీచర్లు అందించారు. వీటి ద్వారా ఈ ఫోన్ కెమెరాలు మరింత పవర్‌ఫుల్‌గా మారనున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)