అన్వేషించండి

Realme Narzo 50 5G Series: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి - రూ.15 వేలలోపే అదిరిపోయే ఫీచర్లతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో రెండు కొత్త బడ్జెట్ 5జీ ఫోన్లను లాంచ్ చేయనుంది. అవే రియల్‌మీ నార్జో 50 5జీ, నార్జో 50 ప్రో 5జీ.

రియల్‌మీ నార్జో 50 5జీ, నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో మే 18వ తేదీన లాంచ్ కానున్నాయి. నార్జో 50 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రో వెర్షన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది.

మే 18వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుంది. కంపెనీ యూట్యూబ్ చానెల్, ఫేస్‌బుక్ పేజీల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ చూడవచ్చు. రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్ సైట్, అమెజాన్ ఇండియా సైట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.

కంపెనీ షేర్ చేసిన టీజర్ ప్రకారం... ఈ విభాగంలో మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను ఈ సిరీస్‌లో అందించనున్నారు. ఇది నార్జో 50 ప్రో 5జీ అయ్యే అవకాశం ఉంది. ఇందులో వాక్యూం చాంబర్ కూలింగ్ సిస్టం, ఐదు లేయర్ల కూలింగ్ కూడా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ధర రూ.15 వేలలోపు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రియల్‌మీ నార్జో 50 5జీ స్పెసిఫికేషన్లు
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... ఈ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ 810 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. రియల్‌మీ జీటీ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. దీని ధర రూ.34,999 నుంచి ప్రారంభం కానుంది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by realme Narzo (@realmenarzoofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
David Warner in Robinhood: 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
Sahkar Taxi Service:ఓలా, ఊబెర్‌కు పోటీగా 'సహకార్'- త్వరలోనే రోడ్లపైకి ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్
ఓలా, ఊబెర్‌కు పోటీగా 'సహకార్'- త్వరలోనే రోడ్లపైకి ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్
Tax on ULIPs: 'యులిప్‌'లపై టాక్స్‌ మోత - ఏప్రిల్‌ నుంచి ఏం మారుతుంది?
'యులిప్‌'లపై టాక్స్‌ మోత - ఏప్రిల్‌ నుంచి ఏం మారుతుంది?
Embed widget