Realme 9i 5G: రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
రియల్‌మీ 9ఐ 5జీ మనదేశంలో ఆగస్టు 18వ తేదీన లాంచ్ కానుంది.
రియల్‌మీ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే రియల్‌మీ 9ఐ 5జీ. ఈ సంవత్సరం జనవరిలో మనదేశంలో లాంచ్ అయిన రియల్‌మీ 9ఐ 4జీ వెర్షన్‌కు 5జీ మోడల్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ధర బడ్జెట్‌లోనే ఉండే చాన్స్ ఉంది.
రియల్‌మీ 9ఐ 5జీ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు డిజిటల్‌గా జరగనుంది.రియల్‌మీ సోషల్ మీడియా చానెళ్లలో ఈ ఈవెంట్‌ను లైవ్ చూడవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల్లో కూడా లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. రియల్‌మీ 9ఐ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.
దీని బ్యాటరీ గురించి రివీల్ చేస్తూ ఇందులో భారీ బ్యాటరీ ఉండనుందని కంపెనీ రివీల్ చేసింది. అలాగే ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించనున్నారు. వీటికి సంబంధించిన డిటైల్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ చూస్తే దీని అంచులు ఫ్లాట్‌గా ఉండనుందని చెప్పవచ్చు. పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపు ఉంది.
రియల్‌మీ 9ఐ 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను రియల్ మీ అందించింది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందించారు.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, బైదు, గ్లోనాస్, డ్యూయల్ సిమ్, 4జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్పీకర్లు కూడా అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ రంగుల్లో లాంచ్ అయింది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!