Realme 11 Pro+: ఒక్క సేల్‌లో ఏకంగా 60 వేలు - రికార్డు సృష్టించిన రియల్‌మీ లేటెస్ట్ ఫోన్!
రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో 60 వేలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయింది.
రియల్‌మీ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 60 వేల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మొదటి సేల్‌లోనే రియల్‌మీ 11 ప్రో ప్లస్ ఈ రికార్డును సృష్టించినట్లు తెలిపారు. రూ.25 వేల పైబడిన మొబైల్ మార్కెట్‌లో రియల్ మీ రికార్డును ఇది బ్రేక్ చేసిందని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ మొబైల్ లాంచ్ చేసింది. ఇందులో కంపెనీ ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
Unprecedented Success: Breaking First Sale Records and Setting New Standards!
— realme (@realmeIndia) June 16, 2023
Cheers to all the #realmeFans. #realme11ProPlus5G #200MPzoomToTheNextLevel pic.twitter.com/SeCdTXx2DV
రియల్‌మీ 11 ప్రో ప్లస్ ధర ఎంత?
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్‌రైజ్ బీజ్ రంగుల్లో రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో అందించారు. ఈ మొబైల్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ ఈ ఫోన్‌లో అందించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ 11 ప్రో కూడా దీంతోపాటే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ కొనాలంటే రూ.27,999 పెట్టాల్సిందే.
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.
ఫోన్ వెనకవైపు 100 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.