Poco F4 5G: రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే - పోకో ఎఫ్4 వచ్చేసింది - వీడియో స్ట్రీమింగ్‌కు స్పెషల్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎఫ్4 5జీ.

FOLLOW US: 

పోకో ఎఫ్4 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చిలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ కే40ఎస్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఐకూ నియో 6, మోటొరోలా ఎడ్జ్ 30, శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

పోకో ఎఫ్4 5జీ ధర
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు. నెబ్యులా గ్రీన్, నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 27వ తేదీ నుంచి జరగనుంది. లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 తగ్గించనున్నారు. అదే ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.3,000 తగ్గనుంది. అంటే ఈ ఫోన్‌ను రూ.24 వేలకే కొనేయచ్చన్న మాట. ఈ ఫోన్‌పై కంపెనీ ఏకంగా రెండేళ్ల వారంటీని అందించనుంది.

పోకో ఎఫ్4 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు హెచ్‌డీఆర్10+, నెట్‌ఫ్లిక్స్‌కు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది.

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను పోకో ఇందులో అందించింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై పోకో ఎఫ్4 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.77 సెంటీమీటర్లు కాగా... బరువు 195 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... పోకో ఎఫ్4 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 23 Jun 2022 08:53 PM (IST) Tags: Poco F4 5G Poco F4 5G Features Poco F4 5G Price in India Poco F4 5G Specifications Poco F4 5G Launched

సంబంధిత కథనాలు

Redmi K50i: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 64 మెగాపిక్సెల్ కెమెరాతో!

Redmi K50i: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 64 మెగాపిక్సెల్ కెమెరాతో!

OnePlus 10RT India Launch: వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ త్వరలోనే - రెండు ఆప్షన్లలో!

OnePlus 10RT India Launch: వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ త్వరలోనే - రెండు ఆప్షన్లలో!

Oppo Reno 8 Price: ఒప్పో రెనో 8 సిరీస్ ధర లీక్ - మిడ్‌రేంజ్‌లో సూపర్ కెమెరా ఫోన్లు!

Oppo Reno 8 Price: ఒప్పో రెనో 8 సిరీస్ ధర లీక్ - మిడ్‌రేంజ్‌లో సూపర్ కెమెరా ఫోన్లు!

JioPhone Next Offer: రూ.4 వేలలోపే స్మార్ట్ ఫోన్ - రూ.14 వేల లాభాలు - బంపర్ ఆఫర్!

JioPhone Next Offer: రూ.4 వేలలోపే స్మార్ట్ ఫోన్ - రూ.14 వేల లాభాలు - బంపర్ ఆఫర్!

Asus ROG Phone 6: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేస్తుంది - 18 జీబీ వరకు ర్యామ్!

Asus ROG Phone 6: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేస్తుంది - 18 జీబీ వరకు ర్యామ్!

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్