By: ABP Desam | Updated at : 26 Oct 2022 04:12 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఒప్పో ఏ17కే స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
ఒప్పో కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో సైలెంట్‌గా లాంచ్ అయింది. అదే ఒప్పో ఏ17కే. ఇందులో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఈ ధరలో ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్ మిగతా బ్రాండ్లలో అందుబాటులో లేదు.
ఒప్పో ఏ17కే ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.10,499గా నిర్ణయించారు. నేవీ బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియరాలేదు.
ఒప్పో ఏ17కే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియా 88.7 శాతంగానూ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఏ17కేలో అందించారు.
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ17కే పని చేయనుంది. దీని బరువు 199 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వెనకవైపు కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 78 డిగ్రీలు కాగా, సెల్ఫీ కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 76.8 డిగ్రీలుగా ఉంది.
వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్లను కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
AP Cabinet Meeting : ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలుంటాయా ?
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?