అరగంటలోనే ఛార్జింగ్.. అద్భుతమైన కెమేరా, మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Nord CE 4 Lite 5G, ధర తక్కువే!
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే ఈ 5జీ ఫోన్ లభించనుంది.
OnePlus Nord CE 4 Lite 5G launched in India: ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడంలో ముందు ఉంటుంది చైనీస్ టెక్ దిగ్గజం వన్ ప్లస్. తాజాగా ఈ కంపెనీ ఇండియాలో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. OnePlus ఇండియా Nord CE 4 Lite 5G పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పాటు 80 W ఫాస్ట్ ఛార్జింగ్, 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేసే ఆక్సిజన్ ఓఎస్ 14పై రన్ అవుతుంది.
Nord CE 4 Lite 5G ధర ఎంత అంటే?
Nord CE 4 Lite 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించి వన్ ప్లస్ ఇండియా ధరలను నిర్ణయించింది. 20 వేల లోపు ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.19,999గా కంపెనీ ఫిక్స్ చేసింది. 8 GB RAM, 256 GB స్టోరేజ్ తో కూడిన టాప్ వెర్షన్ ధరను రూ.22,999గా నిర్ణయించింది.
మూడు రంగుల్లో లభ్యం - 27 నుంచి అమెజాన్‌లో లభ్యం
ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. మెగా బ్లూ, సూపర్ సిల్వర్ వేరియంట్ హ్యాండ్ సెట్లు జూన్ 27 నుంచి అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. త్వరలోనే అల్ట్రా ఆరెంజ్ మోడల్ అమ్మకానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Nord CE 4 Lite 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- Nord CE 4 Lite 5G స్మార్ట్ ఫోన్ 1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్ తో 6.67 ఇంచుల HD+ AMOLED స్క్రీన్‌తో వస్తోంది.
- 120Hz వరకు రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2,100 నిట్స్ బ్రైట్ నెస్ ఉంది.
- ఈ హ్యాండ్ సెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ తో ఆధారంగా రన్ అవుతుంది.
- ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 14పై ఇది నడుస్తుంది.
- 50 MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్ కలిగిన OISతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది.
- ముందు భాగంలో సెల్ఫీల కోసం EIS సపోర్టుతో కూడిన 16MP కెమెరా ఉంది.
- 5,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది.
- కనెక్టివిటీ విషయంలో 5G, Wi-Fi 5, GPS, బ్లూటూత్ 5.1, USB టైప్-Cని కలిగి ఉన్నాయి.
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్ ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
Also Read: అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్ - OnePlus Ace 3 Pro లాంచింగ్ ఎప్పుడంటే?