అన్వేషించండి

OnePlus Nord 5: అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి దూసుకొచ్చిన 5G ఫోన్! ధర, ప్రత్యేకతలు ఇవే!

Oneplus Nord 5 భారత్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. 9వ తేదీ నుంచి సేల్ ప్రారంభంకానుంది. ఇప్పటికే దీన్ని వివిధ మార్గాల్లో కొనుగోలు చేసిన వినియోగదారులు రి‌వ్యూలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

Oneplus Nord 5 : ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న OnePlus Nord 5 ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇవాళ అధికారికంగా (8జులై 2025 )అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించారు. OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో Nord 5తోపాటు Nord CE 5, Buds 4 వంటి ఇతర గ్యాడ్జెట్లు విడుదల చేసిందా కంపెనీ. Nord 5 ఓపెన్ సేల్ జులై 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. OnePlus అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, Flipkart, Myntra, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Nord 5 డిజైన్ & డిస్‌ప్లే

Nord 5 డిస్‌ప్లే చూస్తే 6.83-అంగుళాలు ఉంది. 1.5K AMOLED స్క్రీన్ కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1800 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 

Nord 5 డిజైన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంది. గ్లాస్-మెటల్ కాంబో బాడీ, స్లిమ్ ప్రొఫైల్ (8.1mm), ప్రీమియం లుక్‌తో పాటు మంచి గ్రిప్‌ను కలిగి ఉంది. 

Nord 5లో ఉన్న Aqua Touch 2.0 టెక్నాలజీ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్ స్మూత్‌గా పని చేస్తుంది.

Nord 5 ప్రీమియం టచ్: 10-bit కలర్, 3,840Hz PWM డిమ్మింగ్, ఫ్లాగ్‌షిప్ లెవెల్ కాలిబ్రేషన్ మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.  

Image

Nord 5 ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్ & సాఫ్ట్‌వేర్

ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 3 (2024లో వచ్చిన ఫ్లాగ్‌షిప్ లెవెల్ చిప్).

RAM & స్టోరేజ్: 8GB/12GB LPDDR5X RAM, 128GB/256GB/512GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. 

సాఫ్ట్‌వేర్: OxygenOS 15 (Android 15 ఆధారంగా), 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు.

AI ఫీచర్లు: OnePlus Mind Space, ఫోటో ఎడిటర్, కాల్ లైవ్ ట్రాన్స్‌లేషన్, ఇతర AI టూల్స్ Nord 5లో ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయి. 

కూలింగ్: 7,300mm² డ్యుయల్ వెపర్ చాంబర్ కూలింగ్, Cryo-velocity VC సిస్టమ్ ఉంది. 

Image

Nord 5 కెమెరా ఫీచర్లు

రియర్ కెమెరా 50MP Sony LYT-700 (OIS) + 8MP Ultrawideతో వస్తోంది. 

ఫ్రంట్ కెమెరా 50MP Samsung JN5 (EIS, 4K వీడియో) ఫీచర్స్ కలిగి ఉంది. 

వీడియో కెమెరాకు సంబంధించి 4K@60fps, 1080p@120fps, OIS+EIS ఫీచర్స్ కలిగి ఉంది. 

ఫోటో క్వాలిటీ విషయానికి వస్తే  డే లైట్‌లో నేచురల్ స్కిన్ టోన్స్, డైనమిక్ రేంజ్ బాగుందని రివ్యూలు చెబుతున్నాయి. సెల్ఫీ కెమెరా డీటెయిల్, కలర్ రిప్రొడక్షన్ బాగుందని అంటున్నారు. 

వీడియో క్వాలిటీ కూడా చాలా మెరుగ్గా ఉందని 4K వీడియోలో స్టెబిలిటీ, ఫోకస్ ట్రాకింగ్ బాగుందని టాక్ 

Image

బ్యాటరీ అండ్ ఛార్జింగ్

Nord 5 6,800mAh (ఇండియా వేరియంట్‌లో)బ్యాటరీతో వస్తోంది. 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ కలిగి ఉంది. 80W ఛార్జర్‌ కలిగి ఉన్నందున 40 నిమిషాల్లో వంద శాతం ఛార్జ్ అవుతుంది.

బ్యాటరీ లైఫ్ మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో అత్యధికంగా వస్తుంది. హేవీ యూజ్‌లోనూ 24 గంటల పాటు ఛార్జింగ్ నిలుస్తుంది. 

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో IP65 రేటింగ్ కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్టెరియో స్పీకర్లు ఉన్నాయి. 5G, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, USB Type-C కనెక్టివిటీ కలిగి ఉంది. OnePlus 13s నుంచి వచ్చిన కస్టమైజబుల్ బటన్ కలిగి ఉంది. 

OnePlus Nord 5 ప్రారంభ ధర రూ. 32,000 (8GB)నుంచి 34,999 (128GB)వరకు ఉంది. ఇతర వేరియంట్లు ధరలు స్టోరేజ్ ఆధారంగా ఉంటాయి. లాంచ్ ఆఫర్ల కింద బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, No Cost EMI లభ్యం ఉంది. 

Image

రివ్యూలు ఏం చెబుతున్నాయి ?
Snapdragon 8s Gen 3 వలన ఫోన్ ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్‌గా పని చేస్తోంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌ చేసేటప్పుడు హీట్‌ అవ్వడం లేదు. 144Hz స్క్రీన్, 1.5K AMOLED ప్యానెల్ వలన విజువల్స్, స్క్రోలింగ్ సూపర్ నాచ్‌గా ఉందని రివ్యూలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌కు బ్యాటరీ పెద్ద ప్లస్‌పాయింట్‌గా చెబుతున్నారు. కెమెరా విషయంలో కొన్ని కంప్లైంట్‌లో ఉన్నాయి. లో లైట్‌లో సెల్ఫీలు కొంత డీటెయిల్ తగ్గుతుందని అంటున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ మాన్యువల్‌గా టోగుల్ చేయాల్సి వస్తోంది. ఆటోమేటిక్‌గా మారడం లేదు. 

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
Hair Fall Remedies : జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
Aadhaar card Update: ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
IND Vs SA T20: నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
Embed widget