By: ABP Desam | Updated at : 07 May 2022 07:17 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. (Image Credits: OnePlus)
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందించారు.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను 399 యూరోలుగా (సుమారు రూ.32,100) నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లాంచ్ అయితే ధర రూ.25 వేలలోపే ఉండనుంది.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఫ్రంట్ కెమెరా కోసం హోల్ పంచ్ డిజైన్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్ వూక్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 50W ఎయిర్‌వూక్ ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ వచ్చేసింది.
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?
Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్