News
News
X

OnePlus 9 5G: వన్‌ప్లస్ 9 5జీపై భారీ ఆఫర్ - రూ.16 వేలకే కొనేయచ్చు!

అమెజాన్‌లో వన్‌ప్లస్ 9 5జీపై భారీ ఆఫర్ ఉంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.16 వేలకే కొనేయవచ్చు.

FOLLOW US: 
Share:

వన్‌ప్లస్ 9 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.16 వేల ధరలోనే కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 9 5జీలో ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై పనిచేయనుంది.

వన్‌ప్లస్ 9 5జీ ధర
ఈ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా... రూ.37,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.42,999కు తగ్గింది. అయితే ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే మీ స్మార్ట్ ఫోన్‌ను బట్టి అదనంగా మరో రూ.21,500 వరకు తగ్గింపు లభించనుంది. అంటే రూ.16,099కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట.

వన్ ప్లస్ 9 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9 పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో వన్ ప్లస్ అందించింది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రీఫాం లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ 9 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్న స్పీకర్లు ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 183 గ్రాములుగానూ ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 13 Jun 2022 10:23 PM (IST) Tags: Oneplus OnePlus 9 5G Price Cut OnePlus 9 5G Amazon Offer OnePlus 9 5G Offer OnePlus Offer

సంబంధిత కథనాలు

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు