Nothing Phone 3a Lite: నవంబర్ 27న లాంచ్ కానున్ననథింగ్ ఫోన్.. ట్రిపుల్ కెమెరాతో బెస్ట్ ఫీచర్లు ఇవే
Nothing Phone 3a Lite Price In India | భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ కొత్త ఫోన్ విడుదల కానుంది. నవంబర్ 27న తెలుపు, నలుపు రంగులలో నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

Nothing Phone 3a Lite India Launch: కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో ఇప్పటికే లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (3a) లైట్ భారతదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ 27వ తేదీన ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల ద్వారా దీని విక్రయాలు జరుగుతాయి. భారతదేశంలో కూడా దీనిని అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న కలర్స్ లోనే విడుదల చేయనున్నారు. డిజైన్‌లో కూడా మార్పులు ఉండే అవకాశం లేదు. భారతదేశంలో ఇది కంపెనీ (3a) సిరీస్‌లో కొత్త మోడల్‌గా నిలవనుంది. స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారు ఈ మోడల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నథింగ్ ఫోన్ (3a) లైట్ ఫీచర్లు
నథింగ్ ఫోన్ (3a)లో 6.77 అంగుళాల Full-HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz ఎడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనిని ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్ తో లాంచ్ చేశారు. భారతదేశంలో కూడా ఇదే ప్రాసెసర్ రానుంది. ఈ ప్రాసెసర్‌ను 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ తో జత చేస్తారు. ఇందులో మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా లభిస్తుంది. దీని ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచవచ్చు. ఈ ఫోన్‌లో నథింగ్ ప్రత్యేకతగా నిలిచిన గ్లిఫ్ లైట్ నోటిఫికేషన్ ఇండికేటర్ సైతం ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ పనితీరు
ఫోటోలు, వీడియోల కోసం ఫోన్ (3a) లైట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా లభిస్తాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియోల కోసం 16MP లెన్స్ ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Also Read: Google Warning: పబ్లిక్ వైఫైలో ఈ పొరపాట్లు చేయవద్దు.. నిమిషాల్లోనే మీ ఫోన్ హ్యాక్, బ్యాంక్ ఖాతా ఖాళీ






















