అన్వేషించండి

Google Warning: పబ్లిక్ వైఫైలో ఈ పొరపాట్లు చేయవద్దు.. నిమిషాల్లోనే మీ ఫోన్ హ్యాక్, బ్యాంక్ ఖాతా ఖాళీ

Public Wifi Instrictions: హోటల్, రైల్వే స్టేషన్, కాఫీ షాప్, ఎయిర్ పోర్ట్ లాంటి చోట ఉచిత వైఫై ఉపయోగిస్తున్నారా? వెంటనే ఈ అలవాటు మార్చుకోవాలని గూగుల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది.

Google Warning over Public WIFI: మీరు తరచుగా రైల్వేస్టేషన్లు, కేఫ్‌లు, విమానాశ్రయాలు, హోటళ్లలో ఉచిత Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? అయితే, మీరు వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. పబ్లిక్ Wi-Fi సైబర్ నేరస్థులకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, చాట్‌లను దొంగిలించడానికి సులభమైన మార్గంగా మారిందని Google కొత్త నివేదికలో హెచ్చరించింది.

Android: బిహైండ్ ది స్క్రీన్ నివేదిక వెల్లడి

Google తాజా Android: బిహైండ్ ది స్క్రీన్ నివేదిక ప్రకారం.. పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు ఇప్పుడు యూజర్లకు భద్రతా ప్రమాదాలు (Cyber Crime)గా మారుతున్నాయి. హ్యాకర్లు అసురక్షిత నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని వినియోగదారుల స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్స్, ఇతర డివైజ్‌లలోకి ప్రవేశించి పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ లాగిన్‌లు లేదా ఇతర వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్ లేదా ఏదైనా ఆర్థిక సంబంధిత అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు పబ్లిక్ Wi-Fiని ఉపయోగించవద్దని Google తన యూజర్లను  ప్రత్యేకంగా హెచ్చరించింది.

పెరుగుతున్న మొబైల్ స్కామ్‌ల నుంచి ముప్పు

భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో మొబైల్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయి. Google ప్రకారం స్మార్ట్‌ఫోన్ మోసాలు ఇప్పుడు ఒక గ్లోబల్ సమస్యగా మారింది. ఇది ప్రతి సంవత్సరం వినియోగదారుల బిలియన్ల డాలర్లు దోచుకునేలా చేస్తుంది. ఆ నివేదిక ప్రకారం, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు $400 బిలియన్లు (దాదాపు 33 లక్షల కోట్ల రూపాయలకు పైగా) మొబైల్ స్కామ్‌ల ద్వారా మోసం చేశారు. ఇందులో చాలా మంది బాధితులు తమ డబ్బును తిరిగి పొందలేకపోయారు.

హ్యాకర్లు ఎలా మోసం చేస్తారు?

Google తెలిపిన ప్రకారం.. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఒక నెట్‌వర్క్‌గా పనిచేస్తున్నారు. వారు దొంగిలించిన మొబైల్ నంబర్‌లను కొనుగోలు చేస్తారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ల నుండి లక్షలాది సందేశాలను పంపుతారు. ఫిషింగ్-యాజ్-ఎ-సర్వీస్ లాంటి టూల్స్ ఉపయోగించి అసలైన వెబ్‌సైట్‌లను తయారు చేస్తారు. తద్వారా ప్రజలు తమ లాగిన్ వివరాలు అందిస్తారు. ఈ నెట్‌వర్క్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వాటి స్థానాలను పదేపదే మారుస్తూ మోసాలు చేస్తారు.

సిమ్ కార్డ్‌లు తీసుకుని కొత్త స్కామ్‌లను ప్రారంభించడం సైబర్ నేరగాళ్లకు సులభం అవుతుంది. కొన్నిసార్లు వారు ఫేక్ డెలివరీ లేదా టాక్స్ అలర్ట్‌లను పంపుతారు. కొన్నిసార్లు ఉద్యోగ అవకాశాలు లేదా ఆన్‌లైన్ రిలేషన్ ఏర్పరచుకోవడం ద్వారా నమ్మకాన్ని పొంది, తరువాత డబ్బును కాజేస్తారు. 

భావోద్వేగ బ్లాక్‌మెయిల్‌తో దాడి

సాంకేతిక మోసాలతో పాటు ఇప్పుడు స్కామర్లు భావోద్వేగాలను కూడా ఉపయోగిస్తున్నారు. వారు మీ ఖాతా మూసివేశాం. లేదా "మీ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది" వంటి భయం లేదా ఆందోళనను కలిగించే సందేశాలను పంపుతారు. ఇవి చూసిన ప్రజలు ఏం ఆలోచించకుండా వారు చెప్పింది చేస్తుంటారు. కొంతమంది స్కామర్లు గ్రూప్ చాట్‌లలో తమ సహచరులను చేర్చుకుంటారు. దాంతో అది అసలైన చాటింగ్ గా చూపిస్తారు, తద్వారా బాధితుడిని నమ్మించవచ్చు.

సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలి?

  •  వినియోగదారులకు Google కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలను అందించింది.
  • అత్యవసరమైనప్పుడు మాత్రమే పబ్లిక్ Wi-Fiని ఉపయోగించాలి.
  • పబ్లిక్ వైఫై ద్వారా బ్యాంకింగ్ లేదా ఏదైనా సున్నితమైన వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వకూడదు
  • Wi-Fi ఆటో కనెక్ట్ సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి.
  • నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్, వాస్తవాలను  చెక్ చేయాలి. 

ఏదైనా తెలియని సందేశానికి రియాక్షన్ ఇవ్వడానికి ముందు, దాని మూలాన్ని చెక్ చేయాలి. మీ ఫోన్‌లో సేఫ్టీ యాప్స్ వాడాలి. ఎప్పటికప్పుడూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను చెక్ చేయాలని Google సిఫార్సు చేస్తోంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget