By: ABP Desam | Updated at : 30 Jun 2022 03:21 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
నథింగ్ ఫోన్ 1 ధర ఆన్‌లైన్‌లో లీకయింది
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ జులై 12వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే దీని ధరను కంపెనీ యాక్సిడెంటల్‌గా రివీల్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మూడు వేరియంట్ల ధర ఆన్‌లైన్‌లో లీకైంది. మనదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
నథింగ్ ఫోన్ 1 ధర (అంచనా)
రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఫొటోల ప్రకారం ఇందులో బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 469.99 యూరోలుగా (సుమారు రూ.38,750) ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499.99 యూరోలుగానూ (సుమారు రూ.41,250), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 549.99 యూరోలుగానూ (సుమారు రూ.45,350) నిర్ణయించనున్నారని సమాచారం.
అమెజాన్ జర్మనీ వెబ్ సైట్లో ఈ ధరతో ఫోన్ లిస్ట్ అయింది. అయితే ధర వైరల్ కావడంతో కంపెనీ ఈ లిస్టింగ్‌ను వెంటనే తొలగించింది.
ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. జులై 12వ తేదీన మనదేశ కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!
Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?
50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Realme GT Neo 3T: వావ్ అనిపించే కొత్త ఫోన్ తీసుకురానున్న రియల్‌మీ - ఆ ఒక్కటే సస్పెన్స్!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!
Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం
Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!