By: ABP Desam | Updated at : 15 Jul 2022 04:47 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
నోకియా 5710 ఎక్స్ఏ లాంచ్ అయింది.
హెచ్ఎండీ గ్లోబల్ వినూత్నమైన ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో. ఈ స్మార్ట్ ఫోన్‌లో నోకియా ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించనుంది. ఫీచర్ ఫోన్‌ను నోకియా ఇంత అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. కేవలం డిజైన్‌తోనే ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షించనుంది.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ధర
ఈ ఫోన్ ధరను 64.99 యూరోలుగా (సుమారు రూ.5,190) నిర్ణయించారు. జులై 28వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందో, లేదో తెలియరాలేదు. ప్రస్తుతం మనదేశంలో నోకియా 105, నోకియా 105 ప్లస్ ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్మార్ట్ ఫోన్‌లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 ఎంబీ స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది. వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఈ మొబైల్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Motorola Edge 30 Fusion: మనదేశంలో మోటొరోలా కొత్త ఫోన్ - లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంతో!
Samsung Galaxy A04 Core: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - కీలక వివరాలు లీక్!
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Asus Zenfone 9: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!
50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!