By: ABP Desam | Updated at : 20 Oct 2022 04:28 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ మోడల్ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Motorola)
మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 125W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా సపోర్ట్ చేయనుంది. ఈ 12 జీబీ ర్యామ్ వేరియంట్‌లో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందించారు.
మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర
ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కొనుగోలు చేయవచ్చు.
మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ స్కిన్‌పై మోటొరోలా ఎడ్జ్30 పనిచేయనుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. ఫోన్ వెనకవైపు కర్వ్‌డ్ ప్యానెల్‌తో వస్తుంది. పంచ్ హోల్‌ను డిస్ ప్లే పైన మధ్య భాగంలో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్