Smart Phones: మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా భలే గిరాకీ
Smart Phones: ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ రెండు టాప్ బ్రాండ్లు తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తున్నాయి.

Smart Phones: 2024 సంవత్సరంలో 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ల్లో ఆరు శాతం పెరుగుదల నమోదైంది. టెక్ దిగ్గజాలు ఆపిల్, శామ్‌సంగ్ భారతదేశం నుంచి ఎగుమతులు పెంచడంతో ఈ వృద్ధి రేటు కనిపిస్తోంది. గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ సమాచారం అందించారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 'మేక్ ఇన్ ఇండియా' సర్వీస్ నివేదిక ప్రకారం, 2024లో దేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్, శామ్‌సంగ్ వాటా 94 శాతం.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్‌ను బలోపేతం చేయడంతో ఈ పెరుగుదల కనిపించింది. లక్ష్యానికి అనుగుణంగా ఆపిల్, శామ్‌సంగ్ బ్రాండ్‌లు భారతదేశంలో తమ తయారీని గణనీయంగా విస్తరించాయి. ప్రభుత్వ PLI (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం) పథకం ద్వారా ప్రపంచ తయారీదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో దేశంలో ఉత్పత్తి సౌకర్యాలు ఏర్పాటుకు, విస్తరించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఇవన్నీ స్థానిక తయారీలో కీలక పాత్ర పోషించాయి.
పరిశోధన విశ్లేషకుడు ఎవరు?
సీనియర్ పరిశోధన విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ, "భారతదేశం పెద్ద మార్కెట్, కార్మికలపై పెట్టే ఖర్చులు , ఉత్పత్తి పెంచడానికి అనుకూలమైన ప్రభుత్వ పథకాల కారణంగా ఈ అద్భుతం సాధ్యమైంది. " అని అన్నారు. 2025లో దేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని, స్థానిక మార్కెట్ కూడా పెరుగుతందని ఆయన అన్నారు.
ఫాక్స్‌కాన్ ఫోన్ ఉత్పత్తి పెంచుకోవడానికి స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 2024లో టాటా ఎలక్ట్రానిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తయారీదారుగా నిలిచింది. 107 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇందులో ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడల్స్ ప్రధానమైనవి.
ఐఫోన్ అసెంబుల్ యూనిట్ విస్తరణ
కంపెనీ తన ఐఫోన్ అసెంబుల్ ప్లాంట్‌ను విస్తరించింది. గుజరాత్‌లోని ధోలేరాలో కొత్త ప్లాంట్‌తో సెమీకండక్టర్ తయారీలోకి అడుగుపెట్టింది. మొత్తం మొబైల్ హ్యాండ్‌సెట్ విభాగంలో (స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు), 'డిక్సన్' అతిపెద్ద తయారీదారుగా ఉంది. అయితే ట్రాన్సోషన్, మోటరోలా షిప్‌మెంట్ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయని నివేదిక తెలిపింది.
2024లో దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీలో ముఖ్యమైన కంపెనీగా శామ్‌సంగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఎగుమతుల పెరుగుదల కారణంగా ఏడు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. రెండో స్థానంలో వివో ఉంది. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ రంగంలోకి విస్తరించడం, దాని మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా 14 శాతం వృద్ధితో షిప్‌మెంట్ వాటాను 14 శాతానికి పెంచుకోగలిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

