5G Traffic In India : భారత్‌లో సగటు నెలవారీ డేటా వినియోగం 27.5 GB-మూడు రెట్లు పెరిగిన 5G ట్రాఫిక్
5G Traffic In India : 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ డేటా వినియోగాన్ని భారీగా పెంచుతోంది. ఇప్పుడు సగటు మొబైల్ డేటా వినియోగదారు కంటే 12 రెట్లు ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేస్తున్నట్టు వెల్లడైంది.

5G Traffic In India : భారతదేశంలో ప్రతి వినియోగదారునికి సగటు నెలవారీ డేటా వినియోగం 2024 నాటికి 27.5 GBకి పెరిగింది. గత ఐదు సంవత్సరాల్లో సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR)19.5 శాతంగా చూపుతోందని గురువారం నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ తేల్చింది.
5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) నిరంతర వృద్ధి సాధిస్తూనే ఉంది. FWA వినియోగదారులు ఇప్పుడు సగటు మొబైల్ డేటా వినియోగదారు కంటే 12 రెట్లు ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. నివాస, వ్యాపార సెక్టార్‌లలో అందుబాటులోకి వచ్చిన కొత్త సేవలు ఈ డేటా పెరుగుదలకు దోహదపడ్డాయి.
నివేదికలో పెద్ద బహిర్గతం
నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ (MBIT) ప్రకారం, దేశవ్యాప్తంగా నెలవారీ 5G డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగింది. 2026 మొదటి క్వార్టర్‌కు 4Gని మించిపోతుందని అంచనా వేసింది. 5G డేటా వినియోగ వృద్ధికి కేటగిరీ B, C సర్కిల్స్‌దే ప్రధాన పాత్ర అని నివేదిక పేర్కొంది. ఈ సర్కిల్‌లలో డేటా వినియోగం బీలో 3.4 రెట్లు, సీ సర్కిల్‌లో 3.2 రెట్లు పెరిగింది.
ఈ సర్కిల్‌లలో 5G నెట్‌వర్క్‌ల విస్తరణ డేటా ఈ స్థాయిలో వృద్ధికి ప్రధాన కారణం. మెట్రో సర్కిల్‌ల్లో 5G డేటా వినియోగం ఇప్పుడు మొత్తం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటాలో 43 శాతంగా ఉంది. ఇది 2023లో 20 శాతంగా ఉంది. 4G డేటా వృద్ధి చాలా వేగంగా తగ్గుతోంది. నివేదిక ప్రకారం, భారతదేశ 5G డివైస్ ఎకో సిస్టమ్ వేగంగా మారుతోంది. 2024 నాటికి యాక్టివ్ 5G డివైస్‌ల సంఖ్య సంవత్సరానికి రెట్టింపు అయి 271 మిలియన్లకు చేరుకుంది.
రాబోయే కాలంలో ఈ ట్రెండ్స్ వేగం మరింతగా...
రాబోయే కాలంలో ఈ ట్రెండ్స్ పెరుగుదల మరింత వేగంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2025 చివరి నాటికి దాదాపు 90 శాతం స్మార్ట్‌ఫోన్‌లు 5Gకి సపోర్ట్ చేస్తాయి. 5G అడ్వాన్స్‌డ్ సామర్థ్యాలు 6Gకి మారడానికి ఆధారం అవుతాయని నివేదిక పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

