Pan India Stars : దశాబ్దానికి సరిపడా ప్లానింగ్... ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల పాన్ ఇండియా ప్లానింగ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
Pan India Stars : ప్రభాస్ కల్కి 2, సలార్ 2 వంటి మోస్ట్ మోస్ట్ ఎవైటింగ్ సినిమాలతో బిజీగా ఉండగా, ఆయనతో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఒక దశాబ్దానికి సరిపడా సినిమాల ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు.

Pan India Stars Decade Planning: పాన్ ఇండియా స్టార్లుగా దూసుకెళ్తున్న ముగ్గురు టాలీవుడ్ సూపర్ స్టార్లు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఇప్పటికే భారీ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. వీరు మరో అయిదారేళ్ల పాటు హిందీ బెల్ట్‌లో తమ పరిధిని విస్తరించే భారీ సినిమాలను లైన్లో పెడుతున్నారు. గత రెండు మూడేళ్ల నుంచి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ఈ ముగ్గురు హీరోలు రానున్న ఐదారేళ్ల పాటు బిగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
అరడజను సినిమాలతో ప్రభాస్ బిజీ
సమాచారం ప్రకారం ప్రభాస్ త్వరలోనే 'ఫౌజీ'తో మొదలుపెట్టే బాక్స్ ఆఫీస్ దండయాత్రను ఆ తర్వాత 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' 'బ్రహ్మ రాక్షస్' వంటి భారీ సినిమాలతో కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ ఒకే జానర్ సినిమాలను కాకుండా తన ఖాతాలో ఉన్న అరడజను సినిమాలను ఒక్కో జానర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ హీరో వరుసగా ప్రయోగాలు చేయబోతున్నారు. 'ఫౌజీ' సినిమా ఒక స్పెషల్ పీరియాడికల్ వార్ ఫిలిం అయితే, 'స్పిరిట్' అనేది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోతున్న కాప్ థ్రిల్లర్. అలాగే 'సలార్ 2' పక్కా భారీ యాక్షన్ ఫిల్మ్. ఇక 'ది రాజా సాబ్' మూవీ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. ఈ సినిమాలన్నింటి తర్వాత ప్రభాస్ చేయబోయే 'బ్రహ్మ రాక్షస్' ఒక మైథాలజికల్ ఎంటర్టైనర్ అన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' మూవీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత 'సలార్ 2' మూవీపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ మూవీ 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
మరో ఐదేళ్లు అల్లు అర్జున్ కాల్షీట్లు ఫుల్
ఇక పాన్ ఇండియా స్టార్ అనగానే ప్రభాస్ తర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి. రీసెంట్‌గా 'పుష్ప 2' మూవీతో దాదాపు రూ.18 వేల కోట్లను కొల్లగొట్టిన ఈ హీరో నెక్స్ట్ మరో ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ అట్లీతో కలిసి చేయబోతున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్ట్ 2025 నాటికి ఈ మూవీని షురూ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో పూర్తిగా మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి అట్లీ సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ 2027లో మొదలు కాబోతోంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఒక మైథలాజికల్ మూవీని చేయబోతున్నాడు బన్నీ. ఆ మూవీ కూడా ఇప్పుడు ప్రిపరేషన్ దశలో ఉంది. అలాగే బన్నీ వైఆర్ఎఫ్, సంజయ్ లీలా భన్సాలి లాంటి బడా చిత్ర నిర్మాతలతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
పాన్ ఇండియా వార్‌లో ఎన్టీఆర్ జోరు
పాన్ ఇండియా స్టార్స్‌లో ఎన్టీఆర్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ప్రస్తుతం తారక్ 'డ్రాగన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న మరో హిందీ మూవీ 'వార్ 2' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత 'జైలర్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. 2026 ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అనంతరం 'దేవర' సీక్వెల్ రానుంది. ఈ సినిమాలన్నీ పూర్తై, 'దేవర 2'పట్టాలు ఎక్కాలంటే 2027 దాకా వెయిట్ చేయాల్సిందే. ఇలా 'బాహుబలి' నుంచి 'బ్రహ్మ రాక్షస్' వరకు ప్రభాస్, 'పుష్ప' నుంచి త్రివిక్రమ్ సినిమా దాకా అల్లు అర్జున్, 'ఆర్ఆర్ఆర్' నుంచి 'దేవర 2' వరకు జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ దశాబ్దం పాటు క్షణం తీరిక లేకుండా బిజీబిజీ ప్లానింగ్లో ఉన్నారన్నమాట.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

