By: ABP Desam | Updated at : 02 May 2022 11:56 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐకూ జెడ్6 5జీ స్మార్ట్ ఫోన్‌ను అడాప్టర్ లేకుండా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. (Image Credits: iQoo)
ఐకూ జెడ్6 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడు అడాప్టర్ లేకుండా కూడా విక్రయిస్తున్నారు. అడాప్టర్ ఉన్న మోడల్‌కు, లేని మోడల్‌కు వేర్వేరు ధరలు నిర్ణయించారు. ఐకూ జెడ్6 5జీలో 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ కూడా ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.
ఐకూ జెడ్6 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను మాత్రమే అడాప్టర్ లేకుండా విక్రయిస్తున్నారు. దీని ధర రూ.13,999గా ఉంది. ఇక అడాప్టర్ ఉన్న మోడల్‌లో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా... 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999గానూ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గానూ ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపును దీనిపై అందించనున్నారు. అంటే అడాప్టర్ లేని వేరియంట్‌ను రూ.12,999కే కొనేయచ్చన్న మాట.
ఐకూ జెడ్6 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ జెడ్6 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఐకూ జెడ్6 5జీ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఐకూ జెడ్6 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. మొబైల్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 187 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Redmi Note 11T: రెడ్మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Modi Hyderabad Tour Live Updates: హైదరాబాద్ చేరుకున్న మోదీ, బేగంపేట ఎయిర్ పోర్టులో మాట్లాడుతున్న ప్రధాని
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?