iPhone SE 4: బడ్జెట్ ఐఫోన్ లాంచ్ 2025కు వాయిదా! - ఈసారి డిజైన్ ఛేంజ్!
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ 2025కు వాయిదా పడిందని సమాచారం.
ఐఫోన్ ఎస్ఈ 4 స్మార్ట్ ఫోన్ ఎంతో కాలం నుంచి వార్తల్లో ఉంది. ఐఫోన్ 14 తరహా డిజైన్‌తో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది. మొదట యాపిల్ ఈ ఫోన్‌ను 2024లో లాంచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ కొత్త జనరేషన్ మోడల్ లాంచ్ 2025కు వాయిదా పడిందని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ డిజైన్ ఐఫోన్ ఎక్స్ఆర్ తరహాలో ఉండనుంది. ఆల్ స్క్రీన్ తరహా డిజైన్ ఇందులో అందించనున్నారు. ఐఫోన్ ఎస్ఈ మూడో తరం ఫోన్ గతేడాది మార్చిలో లాంచ్ అయింది.
ఐఫోన్ 14, ఐఫోన్ ఎక్స్ఆర్ తరహా డిజైన్‌లో ఐఫోన్ ఎస్ఈ 4 కూడా లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుంది. దీని అంచులు చాలా ఫ్లాట్‌గా ఉండనుంది. ఫేస్ ఐడీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఐఫోన్ సిరీస్ తరహాలో లాంచ్ టైమ్ లైన్‌ను ఐఫోన్ ఎస్ఈ సిరీస్ లాంచ్ అవ్వవు. యాపిల్ ఎస్ఈ డివైసెస్‌ను కంపెనీ రెండేళ్లకు ఒకసారి లాంచ్ చేస్తుంది. ఇప్పటివరకు యాపిల్ మూడు ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌ను లాంచ్ చేసింది.
మొట్టమొదటి ఐఫోన్ ఎస్ఈ 2016లో లాంచ్ చేసింది. ఆ తర్వాత రెండో జనరేషన్ మోడల్ 2020లో లాంచ్ అయింది. మూడో జనరేషన్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2022) మొబైల్‌ను 2022 మార్చిలో లాంచ్ చేసింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 64 జీబీ మోడల్ ధరను రూ.43,900గా నిర్ణయించారు.
ఐఫోన్ ఎస్ఈ (2022) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఐఫోన్ ఎస్ఈ (2022) పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఉంది. ఫోన్ ముందువైపు, వెనకవైపు అత్యంత కఠినమైన గ్లాస్‌ను అందించినట్లు యాపిల్ అంటోంది. ఐపోన్ 13, ఐఫోన్ 13 ప్రోల్లో అందించిన గ్లాస్ ప్రొటెక్షన్‌ను యాపిల్ ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా అందించింది.
ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌పై ఐఫోన్ ఎస్ఈ (2022) పనిచేయనుంది. ఈ చిప్ ద్వారా ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని యాపిల్ ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ ప్రీవియస్ వెర్షన్ తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో మెరుగైన విజువల్ ప్రాసెసింగ్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. వెనకవైపు అందించిన కెమెరా డీప్ ఫ్యూజన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇందులో 4కే వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది. 60 ఎఫ్‌పీఎస్, స్మార్ట్ హెచ్‌డీఆర్4 వద్ద 4కే వీడియోను రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరా అందుబాటులో ఉంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 5, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, లైటెనింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో టచ్ ఐడీని అందించారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా చార్జింగ్ వస్తుందని యాపిల్ తెలిపింది. ఇది కీ స్టాండర్డ్ బేస్డ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉందని యాపిల్ పేర్కొంది.
Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial