అన్వేషించండి

iPhone 14 Series Pre Orders: ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఎక్కడ కొనొచ్చంటే?

యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ల ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. వీటి ధ‌ర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో సిరీస్‌ల ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభించింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆసక్తి గల వినియోగదారులు వీటిని కొనుగోలు చేయవచ్చు. వేర్వేరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్లలో వీటిని ఆర్డర్ చేయవచ్చు. వీటిపై బ్యాంక్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

ఎక్కడ ఆర్డర్ చేయవచ్చు?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ విషయాన్ని యాపిల్ తెలిపింది.

ఐఫోన్ 14 సిరీస్ ధర
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధ‌ర‌ రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి.

ఐఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్లు
ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే... వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరా అందించారు.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. ఇందులో పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget