Viral News: 11 రూపాయలకే ఐఫోన్ 13 - ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
iPhone 13: ఫ్లిప్‌కార్ట్ బిగ్ మిలియన్ డేస్‌లో 11 రూపాయలకే ఐఫోన్ 13 అంటూ ఫ్లిప్ కార్ట్ చేసిన ప్రకటన పెద్ద స్కామ్ అంటూ కస్టమర్లు మండిపడుతున్నారు. అయితే కొందరికే ఈ అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది.
Flipkart Big Billion Days Sale 2024: ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ మిలియన్ డేస్ ఆఫర్ ప్రారంభమైంది. ఈ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 22 రాత్రి 11 గంటలకు ఐఫోన్ 13ను 11 రూపాయలకే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇది బిగ్ మిలియన్ డేస్ క్యాంపైన్‌లో భాగంగా ఆ ఈ కామర్స్ సంస్థ పెట్టిన ఆఫర్. ఐతే కొద్ది మంది మాత్రమే ఈ ఆఫర్ యుటిలైజ్ చేసుకోగా మిగిలిన వాళ్లు కోపంతో రగిలి పోతున్నారు. ఇదో పెద్ద స్కామ్ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై వివరణ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్ కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఐఫోన్ 13 ధర 11 రూపాయలే వ్యూహం ఏంటి?
ఐఫోన్ 13ను ఆపిల్ 2021లో లాంచ్ చేసింది. దీనిని అత్యంత తక్కువ ధరకు లిమిటెడ్ టైమ్ వరకు ఫ్లిప్‌కార్ట్ సేల్ చేసింది. 11 రూపాయలకే ఐఫోన్ అనడం అన్నది ఆ ఈకామర్స్ జెయింట్ మార్కెటింగ్ స్ట్రాటెజీగా నిపుణులు పేర్కొంటున్నారు. బిగ్ మిలియన్ సేల్స్‌కు ముందే కొన్ని ట్రాన్సాక్షన్స్ నిర్వహించడం కోసమే ఈ ఆఫర్‌ను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. వాళ్లు ఊహించిన విధంగా ఎంతో మంది కష్టమర్ల అటెన్షన్ సాధించగలిగారు. కొంతమంది తాము విజయవంతంగా 11 రూపాయలకే ఈ ఐ ఫోన్ సొంతం చేసుకున్నామంటూ పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన డీల్ తెచ్చినందుకు ఫ్లిప్‌కార్ట్‌కు కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు.
Thanks to the flipkart and @dealztrendz I got My iPhone 13 at 11 ✌️🤑 pic.twitter.com/b0t196jS0Z
— Raj gaming🪐 (@Rajgaming09) September 22, 2024
పెద్ద స్కామ్ అంటున్న కొందరు కస్టమర్లు:
If you were trying to get an iPhone 13 for ₹11 at 11 PM then probably you were probably fooled.
— Neetu Khandelwal (@T_Investor_) September 22, 2024
This is one of the marketing gimmick used by online shopping platforms to create buzz.
"Sold Out" message will pop up for everyone. #flipkartscam #BigBillionDays #Flipkart pic.twitter.com/zAt4SAX1sg
అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన మరికొందరు మాత్రం ఇదో పెద్ద స్కామ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆఫర్ సమయంలో బైనౌ (Buy Now ) బటన్ పనిచేయలేదని అంటున్నారు. చాలా మంది తాము ఐఫోన్ కొనడానికి ప్రయత్నిస్తే అవుట్ ఆఫ్ స్టాక్ మెసేజ్ వచ్చిందని పేర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లందరూ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను మిస్‌లీడ్ చేస్తోందని ఇదో పెద్ద స్కామ్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని, సేల్స్ ట్రాఫిక్ క్రియేట్ చేసి రాబోయే బిగ్‌బిలియన్ సేల్స్‌కు దాన్నో బజ్‌గా వాడుకోవాలని అనుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు వివిధ ప్లాట్‌ఫామ్‌లు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. అయితే వాటిపై కంప్లైంట్‌లు కూడా వచ్చాయి. ఉద్దేశ్య పూర్వకంగానే అవుటాఫ్ స్టాక్ మెసేజ్ వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం పరిమితంగానే ఈ విధమైన ఆఫర్ అందుబాటులో ఉంచామని తెలిపింది. రోజూ రాత్రి 11 గంటలకు ఇలాంటి డీల్స్ వస్తూనే ఉంటాయని కస్టమర్లు నిరుత్సాహ పడొద్దని ప్రకటించింది.
iPhone 13 ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లలో ఐఫోన్ 13పై డిస్కౌంట్లు:
ఈ ఫోన్‌పై కాంట్రవర్సీలు ఎలా ఉన్నా బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. బిగ్‌బిలియన్ డేస్‌లో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 37, 999 రూపాయలకు అందిస్తోంది. అమెజాన్ కూడా ఇదే స్థాయిలో డిస్కౌంట్ ఇస్తోంది. బయట ఈ ఫోన్ ధర 49 వేల 999 రూపాయల వరకూ ఉంది.
Also Read: ఆ ఊర్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు, అందరికీ రుచికరమైన ఆహారం- ఈ స్పెషల్ విలేజ్ ఎక్కడుందో తెలుసా?