News
News
X

Infinix Zero Ultra 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - కేవలం నాలుగు నిమిషాల్లోనే సగం చార్జింగ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ త్వరలో జీరో అల్ట్రా 5జీ అనే ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

FOLLOW US: 

ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ ఉండనుంది. రెండు కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. హోల్ పంచ్‌లో సెల్ఫీ కెమెరాను కూడా అందించనున్నారు.

8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. మిడ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ ఎంట్రీ ఇవ్వనుంది. అధికారిక ప్రకటనకు ముందే దీనికి సంబంధించిన కొన్ని రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీన్ని బట్టి డిజైన్ ఎలా ఉండనుందో తెలుసుకోవచ్చు.

ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుల్గాని ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్, ఫీచర్లను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ లీకుల ప్రకారం... ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇన్‌ఫీనిక్స్ ఫోన్లకు మనదేశంలో కూడా మంచి ఆదరణ ఉంది కాబట్టి ఇండియాలో కూడా దీని ఎంట్రీ కన్ఫర్మ్ అనుకోవచ్చు.

రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ లేదా కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇందులో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మధ్యలో హోల్ పంచ్ కటౌట్ కూడా ఉండనుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని సమాచారం. దీంతోపాటు టెలిఫొటో సెన్సార్, మాక్రో సెన్సార్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఏకంగా 180W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది.

ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో స్మార్ట్ 6 హెచ్‌డీ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,799 ధరకే అందుబాటులో ఉంది. ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్లు అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 31 గంటల పాటు కాల్ మాట్లాడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 20 Aug 2022 04:24 PM (IST) Tags: Infinix Infinix New Phone Infinix 200MP Camera Phone Infinix Zero Ultra 5G Infinix Zero Ultra 5G Launch

సంబంధిత కథనాలు

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?