By: ABP Desam | Updated at : 20 Oct 2022 05:44 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఇందులో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను 199 డాలర్లుగా (సుమారు రూ.16,500) నిర్ణయించారు. ఆల్‌పైన్ వైట్, టస్కనీ బ్లూ, వొల్కానిక్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) సపోర్ట్ చేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) పని చేయనుంది. దీని బరువు 195 గ్రాములుగా ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!
Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!
WhatsApp Update: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?